YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

డ్రాగన్ మారదా

డ్రాగన్ మారదా

డ్రాగన్ మారదా
బీజింగ్, ఏప్రిల్ 25
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ ( కోవిడ్ – 19 )తో పోరాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా వివాదాస్పద సముద్ర ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చూస్తుందని అమెరికా తెలిపింది. శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో ఈ ఆరోపనలు చేశారు. చైనాకు తన చుట్టు ఉన్న దేశాలైన… వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ మలేషియా, బ్రూనైలతో సరిహద్దు విబేదాలు ఉండటంతో పాటు ప్రస్తుతం చైనా ఆ ప్రాంతాలపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుందని పోంపియో తెలిపారు.సౌత్ ఈస్ట్ దేశాల ప్రతినిధులతో కరోనా నివారణ చర్యలు ఆయా దేశాలలో పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన పోంపియో. దక్షిణ చైనా సముద్రంలోని పలు వివాదాస్పద ద్వీపాలను మరియు అక్కడి సముద్ర ప్రాంతాలను పరిపాలనా జిల్లాలుగా చైనా ప్రకటించిందని తెలిపారు.  నెల క్రితం వియాత్నాంకు చెందిన ఫిషింగ్ నౌక అనుమానాస్పదంగా మునిగిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా వైరస్‌ను కట్టడిచేసే పనిలో బిజీగా ఉండగా చైనా మాత్రం చుట్టు పక్కల దేశాలను తన సైనిక చర్యలతో ఆందోళన కలుగచేస్తుందని అన్నారు పోంపియో.చైనా తన దక్షిణ చైనా వైపు ఉన్న సముద్ర ప్రాంతాలలోని దీవులను, దిబ్బలను తనవేనని చెప్తుంది.  అయితే చైనా చర్యలపై భారతదేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పోంపియో అన్నారు. ఎందుకంటే భారత దేశంలోని 55శాతం వాణిజ్యం దక్షిణ చైనా సముద్ర బాగంలోని మలక్కా సంధిగుండా వెళ్తుంది. ఇదివరకే ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారితీసే ఏచర్యలను కూడా  ఉపేక్షించమని భారత్ తెలిపింది.
 

Related Posts