ఇన్వెస్ట్ మెంట్ కోసం బంగారం...
ముంబై, ఏప్రిల్ 25,
బంగారాన్ని కొనుగోలు చేయడం ఇండియాలో సాధారణం. కానీ గత కొంత కాలంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. భవిష్యత్లో మాత్రం పెరుగుతాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. గోల్డ్‌పై ఆసక్తి తగ్గుతున్నప్పటికీ డబ్బులున్నప్పుడు బంగారం కొనుక్కుంటే అవసరాల్లో ఉపయోగపడుతుందనే ఆలోచన కొందరిలో ఉంది. ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లలో 29 శాతం మంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్యూజీసీ) తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. కానీ ఫ్యూచర్‌లో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. 52 శాతం మంది గతంలో కొంత బంగారాన్ని కొన్నారని పేర్కొంది. ఇండియన్ గోల్డ్ మార్కెట్‌పై డబ్యూజీసీ సర్వే చేసి ‘ఇండియా రిటైల్ ఇన్వెస్టర్ ఇన్‌సైట్స్’ పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ సర్వే కోసం 1,005 మంది రూరల్ ఇన్వెస్టర్లను 1,280 మంది అర్బన్ ఇన్వెస్టర్ల(ఆన్‌లైన్‌లో) ను ఇంటర్వ్యూ చేశారు. ఇండియన్ కల్చర్ వలన బంగారాన్ని కొంటున్నప్పటికి, ఇన్వెస్ట్‌మెంట్ కోసం కూడా గోల్డ్‌ను కొంటున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది. గోల్డ్‌ను కొనాలనుకోవడంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయని పేర్కొంది.ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లలో 52 శాతం మంది ఇప్పటికే ఎంతో కొంత గోల్డ్‌ను కొన్నారు. ఇందులో 48 శాతం మంది ఈ సర్వేకి ఏడాదికి ముందే కొన్నారు.29 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌ను కొనలేదు. కానీ ఫ్యూచర్‌లో గోల్డ్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.గోల్డ్‌ను గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రజలు ఎక్కువగా కొంటున్నారు.పట్టణాలలోని ఇన్వెస్టర్లలో 76 శాతం మంది ఇప్పటికే గోల్డ్‌ను కొనుగోలు చేశారు. 21 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌ను కొనుగోలు చేయలేదు కానీ ఫ్యూచర్‌లో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలలో 37 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌ను కొనలేదు. కానీ భవిష్యత్‌లో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇండియన్ మార్కెట్‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి 2,000 మంది రిటైల్ ఇన్వెస్టర్లతో ఈ సర్వే చేశాం. ఈ సర్వేతో ఇన్వెస్టర్ల ఆలోచన విధానాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు గోల్డ్‌ను కొనుగోలు చేయలేదనే పాయింట్ నా దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీ నుంచి మరిన్ని ఆలోచనలను స్వాగతిస్తాం. గోల్డ్ ఇండస్ట్రీ సామర్ధ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తామంటున్నారు.