రష్యాలో పెరుగుతున్న కేసులు
మాస్కో, ఏప్రిల్ 25
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వ్యవహరించారు. కరోనా విషయంలో ఇద్దరిదీ సేమ్ టు సేమ్. కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దానిని లైట్ గా తీసుకున్నారు. మొన్నటి వరకూ తమ దేశంలో కరోనా లేదని చెప్పేశారు. తమ దేశాన్ని కరోనా తాకలేదని కూడా ఆయన చేసిన ప్రసంగం వివాదమయింది. అయితే ఇప్పుడు రష్యాను కూడా కరోనా చుట్టుముట్టింది.రష్యాలో ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ నెల 17వ తేదీ ఒక్క రోజే దాదాపు నాలుగువేలకు పై చిలుకు కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా పాజటివ్ కేసుల సంఖ్య రష్యాలో 35 వేలు దాటంది. మరణాల సంఖ్య కూడా 300 కు చేరుకుది. దీంతో పుతిన్ ఇప్పుుడు అప్రమత్తమయ్యారు. కరోనా మహమ్మారి దేశాన్ని కబళిస్తుందని గ్రహించి చర్యలకు ఉపక్రమించారు.మే 1వ తేదీ వరకూ పుతిన్ రష్యాలో లాక్ డౌన్ విధించారు. మాస్కో నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో మాస్కోలో 500 పడకలతో కరోనా ఆసుపత్రిని నిర్మించాల్సి వచ్చింది. చైనా నుంచి మందులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రష్యాలో కూడా కరోనా వదిలిపెట్టకుండా వ్యాపిస్తుండటంతో పుతిన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. అన్ని దేశాలూ ముందుగానే చర్యలు ప్రారంభించినా పుతిన్ మాత్రం రష్యాలో నింపాదిగా ఉన్నట్లు అంతర్జతీయ పత్రికలు కూడా తప్పపడుతున్నాయి.రష్యా చైనా సరిహద్దు దేశం. నిజానికి చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందగానే అలర్ట్ కావాల్సింది. కానీ పుతిన్ జనవరి 30వ తేదీ వరకూ చైనా సరిహద్దులను మూసివేయలేదు. డిసెంబరులో చైనాలో వైరస్ ప్రారంభమయినా దాదాపు నెల రోజుల పాటు పుతిన్ నిర్లక్ష్యం వహించారు. 12 ఏళ్ల పాటు తాను పదవిలో కొనసాగడానికి చేపట్టిన రాజ్యాంగ సవరణపై ఓటింగ్ ఉండటం వల్లనే పుతిన్ కరోనాను లైట్ గా తీసుకున్నారంటున్నారు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడు రష్యాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.