YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

యుద్దం లో సైనికులు!! కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !!!

యుద్దం లో సైనికులు!! కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !!!

యుద్దం లో సైనికులు!!
కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !!!
కరోనా పరీక్ష నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము 7 RTPCR/VDRL లాబ్ లను నెలకొల్పింది.
వీటితోపాటు ట్రునాట్ ల్యాబ్, Chemilucency లాబ్  లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కో వి డ్ పరీక్షలు నిమిత్తమై ఏర్పాటు చేశారు తద్వారా ఈనాడు రోజుకి ఆరు వేల పైచిలుకు శాంపిల్స్ను పరీక్ష చేయగలుగుతున్నాము దేశంలోనే మన రాష్ట్రం పరీక్షల విషయంలో అగ్రగామిగా నిలిచింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి శాంపుల్ లను పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు పాజిటివ్ గా లేదా నెగిటివ్ అని ఒక్క విజయవాడలోనే రమారమి రోజుకు వెయ్యి శాంపుల్ టెస్ట్ చేసే సామర్థ్యము కలదు. ఈ ల్యాబ్ లో ఎక్కువశాతం పాజిటివ్ ఉన్న శాంపిల్స్ను ఎగ్జామ్ చేయటంలో ధైర్యంగా సాహసోపేతంగా రాత్రింబవళ్ళు వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగితే వారికి ఈ వైరస్ సోకుతుంది.  హైరిస్క్ ప్రదేశంలో ఉండి ప్రజల యొక్క క్షేమం గురించి రేయింబవళ్ళు తమకు రిస్కు ఉన్నది అని తెలిసినా కూడా చిరునవ్వుతో దేహం అంతా personal protective equipment తో పూర్తిగా కప్పుకొని ఎంతో ధైర్యంతో ఈ టెస్ట్లను నిర్వహిస్తూ ఉంటారు. ఒక కరోనా పాజిటివ్ కేసు ఉన్నది అంటేనే ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల వారు గడగడలాడి పోతూ ఉంటారు. అలాంటిది ఇది ప్రతి శాంపుల్ లో వైరస్ ఉంది/  ఉంటుంది అని తెలిసి కూడా మనోధైర్యంతో హైరిస్క్ జోన్లో పని చేస్తున్నటువంటి ఈ వైద్య సిబ్బందికి మనమందరం ఎంతైనా రుణపడి ఉన్నాము. ఈరోజు ఈ లేబరేటరీలో  రేయింబవళ్ళు గత ముప్పై తొమ్మిది రోజులుగా అలసట లేకుండా బాహ్య ప్రపంచంతో  సంబంధం లేకుండా పనిచేస్తున్న వీరందరిని చూసిన తర్వాత ప్రతినిత్యం కుటుంబం కంటే సమాజ సేవే ముఖ్యం అని వీరు చెప్తుంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క రూ యుద్ధములో శత్రువు ని ఎదిరుస్తున్న వీర సైనికుడు లాగా కనిపిస్తున్నారు. క రోనా పైన ప్రత్యక్షంగా ముందుండి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వీరందరికీ మన అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు!!!
మనందరం భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉండటమే మనం వీరందరికీ ఇవ్వగలిగిన నిజమైన కృతజ్ఞతాభివందన ములు!! 

డాక్టర్ అర్జా శ్రీకాంత్
Covid స్టేట్ నోడల్ ఆఫీసర్
 

Related Posts