YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాట తప్పిన ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది సైకిల్ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు

మాట తప్పిన ప్రధాని నరేంద్రమోడీ  కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది  సైకిల్ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని వెంకటపాలెం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ యాత్రను ప్రారంభించారు. స్వయంగా సైకిల్ నడుపుతూ ర్యాలీకి నాయకత్వం వహించారు. తొలుత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ప్రజనుద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, ఇదెంతో దుర్మార్గమని చెప్పారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాందెడ్ల భాస్కరరావు సహాయంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కుట్రలతో కూలదోసినప్పుడు తాము పోరాటం చేసి కేంద్రం మెడలు వంచామని, ఫలితంగా ఎన్టీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సోనియాగాంధీ అశాస్త్రీయంగా విభజించారని, కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ఆ పార్టీ ఆంధ్రులు రగిలిపోయారని, ఆగ్రహ జ్వాలల మధ్య కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలుగువారితో పెట్టుకోవద్దని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం తాము ప్రారంభించిన పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు అన్నారు. రైతులు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఉదారంగా, స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమినిచ్చారని, ఇందువల్ల రైతులు లాభపడ్డారని, ప్రభుత్వం కూడా ప్రయోజనం పొందిందని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, ఇది దారుణమైన విషయమని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి మోడికో యోగిత విరాళం రూ.5 లక్షలు కాగా యోగిత అనే మెడికో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి విరాళంగా అందజేశారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ యోగితను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు ఉదారంగా సహకరించాలని, బాండ్లపై బ్యాంకులకంటే ఎక్కువ వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగిన సైకిల్ ర్యాలీలో మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Related Posts