YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆందోళనలో బిల్డర్లు, రియాల్టర్లు

ఆందోళనలో బిల్డర్లు, రియాల్టర్లు

ఆందోళనలో బిల్డర్లు, రియాల్టర్లు
హైద్రాబాద్, ఏప్రిల్ 25
కరోనాతో అన్ని రంగాలు స్తంభిం చిపోయాయి. వ్యాపారాలన్ని బోసిపోయాయి. వ్యవసాయ రంగం తర్వాత పరిశ్రమల రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలే ముఖ్యమైనవి. కరోనా కారణంగా నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సడలింపు కుదరదని ప్రకటించింది. సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశముందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణలో పనులు బంద్‌ అయ్యాయి. దీంతో లక్షలాది మంది ఉపాధి దూరమయ్యారు. కోట్ల రూపాయల పెట్టు బడిపెట్టి ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచి పోయాయని, బ్యాంకు రుణాలు చెల్లించడం కష్టంగా మారిందని బిల్డర్లు, డెవలపర్స్‌ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తారుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగుతుంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలో అత్యధిక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఏడాదికి 10వేల అపార్ట్‌మెంట్లు పూర్తిచేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.50లక్షల అంచనాతో సుమారు రూ.5వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 60శాతం నిర్మాణాలు ఉన్నాయి. జనాభా పెరుగుతున్న తరుణంలో భూమి, నిర్మాణాలపై అధికంగా పెట్టుబడి పెడుతున్నారు.నిర్మాణ రంగం నిలిచిపోవడంతో ఆదాయం రాకపోవడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బీహార్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు ఇక్కడి ఉండాల్సి వచ్చింది. ఆయా ప్రాజె క్టుల్లో పనిచేస్తున్నవారికి అక్కడ నివాసం కల్పిం చడంతోపాటు భోజన సౌకర్యంతోపాటు అన్ని రకాల వస తులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితోపాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీలు చెల్లించడం, నెలవారీ ఈఎంఐలు చెల్లించడం, ఉద్యోగుల వేతనాలు, బ్యాంకుల్లో ఓవర్‌డ్రాఫ్ట్‌లు, ఆలస్యమవుతున్న కొద్దీ నిర్మాణ ఖర్చులు పెరగడం, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కార్మికులు సొంత ఊర్లకెళ్లి వస్తారో?రారో? వంటి విషయాలపై బిల్డ ర్లు, డవలపర్స్‌ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో కార్మికులను పనులు జరిగే ప్రాంతాల్లోనే ఉంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 210 కేంద్రాల్లో 35వేల మంది కార్మికులు ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. కరోనా నివా రణలో భాగంగా కార్మికులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బిల్డర్లు, డవలపర్స్‌, కాంట్రాక్టర్లపైనే ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీంతోపాటు కార్మికులకు కావాల్సిన నిత్యావసర సరుకులు, వాటర్‌, కూరగాయలు వసతులు కల్పించడంతోపాటు పారిశుధ్య నిర్వహణ, వైద్య పరీక్షలు నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయించింది
 

Related Posts