YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పొగాకు రైతులను తక్షణమే ఆదుకోండి: చంద్రబాబు

పొగాకు రైతులను తక్షణమే ఆదుకోండి: చంద్రబాబు

పొగాకు రైతులను తక్షణమే ఆదుకోండి: చంద్రబాబు
హైదరాబాద్ ఏప్రిల్ 25
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందున ఆంధ్రప్రదేశ్ లోని పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుకు ఆయన లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందని, దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రీటైల్ మార్కెట్లో విక్రయించే అవకాశం రైతులకు ఉందని, కానీ పొగాకు రైతులకు ఆ అవకాశం లేదని అందువల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు.మార్చి తొలి వారంలోనే జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడిందని, ఇది మరింత ఆలస్యమైతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. బోర్డు వెంటనే స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.
 

Related Posts