సెప్టెంబర్‌లో కాలేజీలు తెరవండి.. యూజీసీ సూచనలు
హైదరాబాద్ ఏప్రిల్ 25
కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలు, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త విద్యా సంవత్సరాన్ని ఎప్పటి మాదిరిగా జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదనలు చేసింది. కోవిడ్19 నేపథ్యంలో కాలేజీల అంశాన్ని స్టడీ చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను వేసింది. విద్యా సంవత్సరం నష్టంతో పాటు ఆన్‌లైన్ విద్య గురించి ఆ కమిటీలు స్‌ిడీ చేశాయి. హర్యానా వర్సిటీ వీసీ ఆర్‌సీ కుహద్ నేతృత్వంలో ఓ కమిటీ వర్సటీ పరీక్షల గురించి అధ్యయనం చేసింది. ఇగ్నో వీసీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్‌లైన్ పరీక్షల గురించి రిపోర్ట్ తయారు చేసింది.అయితే రెండు కమిటీలు శుక్రవారం యూజీసీకి నివేదికలు అందించాయి. దాంట్లో ఓ కమిటీ.. అకాడమిక్ సంవత్సరాన్ని జూలైకి బదులుగా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని సూచించింది. ఒకవేళ వర్సిటీల్లో కావాల్సినంత మౌళిక సదుపాయాలు ఉంటే, వారు ఆన్‌లైన్ పరీక్షలు చేపట్టవచ్చు అని మరో కమిటీ సూచించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ ఆ రెండు కమిటీ నివేదికలను పరిశీలిస్తున్నది. మరో వారం రోజుల్లోగా దీనిపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.