YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఏడాది చివరినాటికి రూ.82 వేలకు చేరుకొనున్న బంగారం ధర!

ఏడాది చివరినాటికి రూ.82 వేలకు చేరుకొనున్న బంగారం ధర!

ఏడాది చివరినాటికి రూ.82 వేలకు చేరుకొనున్న బంగారం ధర!
ముంబై ఏప్రిల్ 25
 బంగారం ధరలు భగభగ మండబోతున్నాయి.  కరోనా వైరస్‌ తాకిడి, స్టాక్‌-బాండ్‌ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీ) వచ్చే ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర ఏకంగా రూ.82 వేలకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ గోల్డ్‌ ధర 3 వేల డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఔన్స్‌ ధర 1,726 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది.ఇప్పటి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే పసిడి సురక్షితమైనదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటం, కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. మరోవైపు అమెరికా మార్కెట్లో క్రూడాయిల్‌ ప్రతికూలానికి పడిపోవడం కూడా పసిడి భగ్గుమనడానికి పరోక్షంగా దోహదం చేయనున్నదని తెలిపింది.లాక్‌డౌన్‌ కారణంగా బంగారు ఆభరణాల దుకాణాలు మూతపడటంతో ఫ్యూచర్‌ మా ర్కెట్లో పసిడి ధర అధికమవుతున్నది. అలాగే డాలర్‌ బలపడుతుండటం, ఆర్థిక మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు క్రమం గా తగ్గుతుండటం, అధిక ధరల కారణంగా భారత్‌-చైనా దేశాల్లో పసిడికి డిమాండ్‌ పడిపోతున్నదని బీవోఎఫ్‌ఏ తెలిపింది.  
 

Related Posts