YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

వెనకంజ వేసేది లేదు పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

Highlights

  • వెనకంజ వేసేది లేదు పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు
వెనకంజ వేసేది లేదు పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

అమరావతి: టిడిపి ఎంపిల పోరాటాన్ని 5కోట్లమంది ప్రజలు అభినందిస్తున్నారు. ఒక సంకల్పంతో టిడిపి ఎంపీలు పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. శుక్రవారం అయన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మనపోరాటంలో చిత్తశుద్ధి ఉంది.లక్ష్య సిద్ధి కోసం పోరాటం చేస్తున్నాం. ఇది నావిధి, నా కర్తవ్యం,నా బాధ్యత అని ప్రతి ఒకరు భావించాలని అన్నారు. అప్పుడే ఎటువంటి అనారోగ్యం,అస్వస్థత మన దరిచేరదు. రాజ్యసభలో ఎంపిల మెరుపు ధర్నాతో జాతీయస్థాయిలో ప్రకంపనలు పుట్టాయని అన్నారు. టిడిపి ఎంపిల పోరాటం రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. ఈరోజే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ చివరిరోజు.ఎంపిల పోరాటం మరింత ఉధృతం చేయాలి. దశలవారీగా పోరాటం చేయాలి,వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అయన సూచించారు. ఎంపీల మానవ హారానికి వైసిపి ఎంపిల గైర్హాజరు మ్యాచ్ ఫిక్సింగ్ కు మరో రుజువని అన్నారు. వైసిపి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.ప్రజలే వారికి గుణపాఠం చెబుతారు. గతంలో బ్రిటిష్ వారికి స్థానికులే కొందరు అండదండలిచ్చారు. అదేతరహాలో ఇప్పుడు వైసిపి కేంద్రానికి కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఐదుగురు లోక్ సభ సభ్యులే రాజీనామా చేస్తారనడం నాటకం కాదా..? వైసీపి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయరా..? దీనినేమంటారు..?ఇది నాటకం కాదా...? చేస్తే ఎంపిలంతా రాజీనామా చేయాలని అన్నారు. లోక్ సభ సభ్యులకో న్యాయం, రాజ్యసభ సభ్యులకో న్యాయమా అని ప్రశ్నించారు. నాటకాలు మానండి, డ్రామాలతో రాష్ట్రానికి నష్టం చేయకండి. నరేంద్ర మోడి పక్షాన ఉంటారా..?ఏపి ప్రజల పక్షాన ఉంటారా తేల్చుకోండని అన్నారు. మోడి పక్షాన ఉండి చరిత్రహీనులుగా మారతారా..? పోరాడి తెలుగుజాతి గౌరవం నిలబెడతారా..? తేల్చుకోండని వైకాపా ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఎంపిలు రాజీనామా చేయడమంటే పోరాటం నుంచి పారిపోవడమే. కేంద్రంపై జరుగుతున్న పోరాటంలో ఎంపిలే మన సైనికులు తంలో మొండిగా వ్యవహరించి కాంగ్రెస్ దెబ్బతిందని చంద్రబాబు గుర్తు చేసారు. ఇప్పుడు మొండిగా వ్యవహరించి బిజెపి దారుణంగా దెబ్బతింటుంది. విభజించి పాలించు తరహాలో బిజెపి వ్యవహరిస్తోంది. విపక్షాలలో చీలికలు తెచ్చి చిచ్చుపెట్టాలని చూస్తోందని అయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో బిజెపిని ప్రజలు ఛీకొడుతున్నారు.దేశం మొత్తం బిజెపిని ఛీకొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఢిల్లీనుంచి రాష్ట్రానికి వచ్చాక 13జిల్లాలలో ఎంపిల పర్యటనలు చేయాలని అన్నారు. బహిరంగ సభల ద్వారా చేసిన పోరాటంపై ప్రజలను చైతన్యపరచాలి. ఈరోజు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి సైకిల్ యాత్ర ద్వారా నిరసనలు తెలియజేస్తున్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేదాకా వెనుకంజే వేసేదిలేదని అయన స్పష్టం చేసారు.

Related Posts