YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను డ్యామేజ్ చేసే ఉద్దేశం టిడిపికి లేదు - టి.జి భ‌ర‌త్‌

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను డ్యామేజ్ చేసే ఉద్దేశం టిడిపికి లేదు -  టి.జి భ‌ర‌త్‌

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను డ్యామేజ్ చేసే ఉద్దేశం టిడిపికి లేదు
-  టి.జి భ‌ర‌త్‌
కర్నూలు ఏప్రిల్, 25
తెలుగుదేశం పార్టీ వారెవ్వ‌రూ ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్‌ను డ్యామేజ్ చేసే విధంగా చెయ్య‌డం లేద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టిడిపి ఇలాంటి మూర్ఖ‌మైన‌ ప‌నులు చెయ్యాల‌ని పార్టీ నేతలకు  చెప్ప‌లేద‌న్నారు. కర్నూలు తెలుగుదేశం పార్టీలో మీపై ఇలా చేయాల‌న్న ఉద్దేశ‌మే లేద‌న్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న మీరు మీపై బుర‌ద‌జ‌ల్లే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి కానీ.. టిడిపిని నిందించ‌డం త‌గ‌ద‌న్నారు. ఇక హ‌ఫీజ్‌ఖాన్ చుట్టూ శ‌త్రువులు ఉండి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంద‌న్నారు. ఇంకేమైనా సందేహాలుంటే త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడాల‌న్నారు. మీరు ఆరోగ్యంగా ఉండి మీ పాల‌న‌లో మంచి మార్పు రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.
 

Related Posts