YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి
- కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా
స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు
ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి
వ్యవసాయాధారిత రంగాలకు మినహాయింపు
ఉపాధి హామీ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులకు అనుమతి
న్యూఢిల్లీ  ఏప్రిల్ 25
  కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ కొరకు చేపట్టిన లాక్ డౌన్ అమలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకు సూచించారు. లాక్ డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రపంచంలోని అగ్ర రాజ్యాల సైతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన దేశం లో కోంతమేర  వైరస్ వ్యాప్తి నిరోధించామంటే లాక్ డౌన్ విధించడమే కారణమని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు..  నిత్యావసర సరుకుల కొరత, సరఫరా విభాగం లో అంతరాయం నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదని, అక్కడ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించాలని, భవిష్యత్తులో ఆహార కొరత రాకుండా వ్యవసాయ ఆధారిత పనులకు ఆటంకం కలిగించవద్దని ఆయన తెలిపారు.  దేశవ్యాప్తంగా కరోణ పాజిటివ్  వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ గుర్తించామని, ఆ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మినహాయించి ఎలాంటి సడలింపులు ఉండదని ఆయన స్పష్టం చేశారు.. కరోనా పాజిటివ్ కేసులువచ్చిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కలెక్టర్లకు వివరించారు.    లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా, రవాణా సౌకర్యాలు రద్దు చేస్తున్నామని, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు షాపింగ్ మాల్స్, మూసి ఉంటాయని, మత ప్రార్థనలు దైవ కార్యక్రమాలకు అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాల కార్యకలాపాలు ప్రారంభించాలని , పట్టణ ప్రాంతాల్లో గృహ సముదాయాల మధ్య ఉన్న దుకాణాలు కలాపాలు కొనసాగించవచ్చని మార్కెట్లలో షాపింగ్ మాల్స్ మాత్రం మూసివేయాలని తెలిపారు.  వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, విత్తనాల, ఎరువుల తయారీ, వ్యవసాయాధారిత రంగాలకు  వ్యవసాయ పరికరాలు విడిభాగాల దుకాణాలు, వ్యవసాయ యంత్రాల రవాణా ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.  ఈ కామర్స్ కంపెనీల ద్వారా అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరా అనుమతి ఉందని తెలిపారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు రోడ్డు ,సాగునీటి , పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టే సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పనిలో  పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు.  వలస కూలీల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి కనీస వసతులు కల్పించాలని సూచించారు. వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారికి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని, ముగిసేవరకు ఎక్కడి వారు అక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు పరిశీలించి లాక్ డౌన్ లో సడలింపు ల పై తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.  హాట్ స్పాట్ ప్రాంతాలను రాష్ట్ర , జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలని, సదర్ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవని తెలిపారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, బహిరంగ ప్రదేశాల్లో పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిందని, ప్రదేశాల్లో ఉమ్మితే భారిగా జరిమానా విధించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.  ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డిటిహెచ్ కేబుల్ సర్వీసులు యధావిధిగా నడుస్తాయని,  కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరిగా మినహాయింపు పొందిన వారు పాటించాలని ఆయన తెలిపారు.
 

Related Posts