YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ లొ ఇంటి దొంగలు......!!

ఎస్సీ కార్పొరేషన్ లొ ఇంటి దొంగలు......!!

వరంగల్ :ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ప్రభుత్వం ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన..అక్రమాలకు అడ్డు పడడం లేదు. బ్యాంకర్లు, అధికారులు కలిసి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, అధికారులు దళారులతో చేతులు కలిపి బోగస్‌ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల రుణాలకు ఎసరు పెడుతున్నారు. రుణాల లబ్ధిదారుల ఎంపికలోనూ అదే తీరు కొనసాగుతోంది. నిరుపేద, నిరుద్యోగ, షెడ్యూల్డు కులాలవారికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వం భూమి కొనుగోలు పథకమే కాకుండా ..రాయితీతో బ్యాంకు రుణాలను అందిస్తుంది. 93రకాలైన యూనిట్లను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధికి ఆసరా కల్పిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 80శాతం రాయితీ సొమ్మును ప్రభుత్వం అందిస్తుండగా.. మిగిలిన 20శాతం బ్యాంకులు రుణాలను మంజూరు చేయాల్సి ఉందిఅక్రమాలను అడ్డుకోవడానికి ట్రాన్స్ పరెన్సీ కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో లేదు. మార్చి నెలాఖరు వరకు 472 మందికి రుణాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. . పైసా ఖర్చు లేకుండానే లబ్ధిదారులకు రుణాలు ఇస్తుండటంతో దళారుల ప్రమేయం ఎక్కువైంది. బోగస్‌ లబ్ధిదారుల పేరుతో బ్యాంకర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కలిసి భారీగా రాయితీ సొమ్మును కాజేశారు. జిల్లాలో 80శాతం వరకు అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీటిపైన సమగ్రంగా విచారణ జరిపించి అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఉన్నతాధికారులు మొహమాట పడుతున్నారు.అర్హులకు రుణాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లు ఈ రుణాల మంజూరులో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బ్యాంకు రుణం ఇవ్వకుండానే.. ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీ సొమ్మును కొందరు బ్యాంకర్లు కాజేశారు. ఇప్పటికే పలు బ్యాంకులపైన విచారణ జరిపించగా అవినీతి బయటపడింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు చూపించి.. రూ.కోట్లు దండుకున్నారు. ఇప్పటికీ ఆ ఏడాదిలో బ్యాంకర్లు ఇచ్చిన రుణలబ్ధిదారుల వివరాలు ఇవ్వడంలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అక్రమాలను గుర్తించారు. ఇప్పటికీ ఆ బ్యాంకు అధికారులు గతంలో రుణాలిచ్చిన లబ్ధిదారులకు సంబంధించిన యూసీలను సమర్పిచలేదు. అవినీతి అక్రమాల నేపథ్యంలో ఇక రుణాలు ఇవ్వొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా.. ఆ ఆదేశాలను పట్టించుకోకుండానే మళ్లీ మొదలు పెట్టారు.

Related Posts