YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

భక్తులు లేని సింహాచలం

భక్తులు లేని సింహాచలం

భక్తులు లేని సింహాచలం
విశాఖపట్నం ఏప్రిల్ 25
దేశ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కరోనా,  చరిత్రలను సైతం తిరగరాస్తోంది. అనాదిగా వస్తున్న ఆచారాలను కొనసాగించకుండా అడ్డుపడుతోంది. విశాఖ సింహాచలం దేవస్ధానం చరిత్రలోనే లేని విధంగా చందనోత్పవం నిర్వహించాల్పిన పరిస్ధితి దేవస్ధానం అధికారులకు ఎదురైంది. భక్తులు లేకుండా ఆదివారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకాదశి పర్వదినాన తొలి చందనం అరగదీత ప్రారంభమైంది.కరోనా ఆంక్షల నేపద్యంలో పరిమిత సంఖ్యలో వైదిక బృందం ఆధ్వర్యంలో చందనం అరగదీత ప్రారంభించారు.అయితే భక్తుల దర్శనాలను నిలిపివేసిన అధికారులు,  ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందన పూతలో దర్శనమిచ్చే స్వామి, ఒక్కరోజు అంటే వైశాఖ శుద్ధ తదియ నాడు కొద్ది గంటలు మాత్రమే భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అదే స్వామివారి చందన యాత్రగా, చందనోత్సవంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఏడాది చందనోత్సవం రేపు జరగనుంది.భూమిలో దాగివున్న పాదాలతో కూడిన స్వామివారి నిజరూప దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తీసివేయగా లభిస్తుంది. ఆ వేళకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. అర్చనాదులు పూర్తిచేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, తిరిగి చందనం పూయడం, లేపనం తర్వాత స్వామి శివలింగ రూపంలో దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక.అయితే ఇదంతా గతం ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో భక్తులు లేకుండానే కేవలం ఆలయ అధికారులు పూజారి సమక్షంలోనే చందనోత్సవం ఏర్పాటు చేస్తున్నారు.వేడుకను సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించింది.అయితే ఈ సారి స్వామి వారి దర్శనం లేకపోవడంతో అప్సన్న స్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కరోనా మహమ్మారి చివరికి ఆద్యాత్మిక కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపిస్తోందని అన్నారు.
 

Related Posts