YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నివాస ప్రాంతాల్లోని షాపులు తెరుచుకునేందుకు కేంద్రం వెస‌లుబాటు

నివాస ప్రాంతాల్లోని షాపులు తెరుచుకునేందుకు కేంద్రం వెస‌లుబాటు

నివాస ప్రాంతాల్లోని షాపులు తెరుచుకునేందుకు కేంద్రం వెస‌లుబాటు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 25
నివాస ప్రాంతాల్లో ఉన్న షాపులు తెరుచుకునేందుకు కేంద్రం వెస‌లుబాటు క‌ల్పించింది.  కొత్తగా జారీ చేసిన‌ ఆదేశంలో మార్కెట్ కాంప్లెక్స్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల ప‌రిధిలో ఉన్న మాల్స్ తెర‌వ‌డానికి వీలులేదు. అయితే నివాస ప్రాంతాల్లో ఉన్న షాపులు మాత్రం కేవ‌లం 50 శాతం సిబ్బందితోనే తెర‌వాల్సిన ష‌ర‌తు ఉంటుంది.  కేంద్ర హోంశాఖ ప్ర‌తినిధి .. శుక్ర‌వారం రాత్రి దీనిపై ఓ ప్ర‌ట‌క‌న విడుద‌ల చేశారు. షాపులు తెరిచిన‌వారు క‌చ్చితంగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధ‌రించాల‌ని, సామాజిక దూరాన్ని కూడా పాటించాల‌ని కేంద్ర హోంశాఖ స్ప‌ష్టం చేసింది. రిజిస్ట‌ర్ అయిన షాపుల‌కు మాత్రం తెరుచుకునే అవ‌కాశం క‌ల్పించారు. మ‌ల్టీ బ్రాండ్ మాల్స్‌లో ఉన్న షాపులకు ఈ అవ‌కాశం ‌లేదు.  అయితే ఈ స‌డ‌లింపులు కూడా హాట్‌స్పాట్‌, కాంటైన్మెంట్ జోన్ల‌కు వ‌ర్తించ‌దు.  దేశ‌వ్యాప్తంగా సుమారు 23వేల మందికి క‌రోనా సోకింది. 700 మంది మ‌ర‌ణించారు.  

Related Posts