YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ఉత్తర కొరియా అధినేత కిమ్ కు అనారోగ్యం!

ఉత్తర కొరియా అధినేత కిమ్ కు అనారోగ్యం!

ఉత్తర కొరియా అధినేత కిమ్ కు అనారోగ్యం!
న్యూఢిల్లీ ఏప్రిల్ 25
ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అంచనా వేసేందుకు చైనా తన వైద్య బృందాలను పంపించింది. ఏమైందో తెలియదు కానీ కిమ్ గత కొద్ది కాలంగా ప్రజలకు కనిపించడం లేదు. ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు.విపరీతంగా బరువు పెరిగిపోవడంతో హృద్రోగ సమస్య వచ్చిందని అందువల్లే కిమ్ బయటకు రావడం లేదని అంటున్నారు. ప్రపంచంలో అత్యంత రహస్యంగా ఉండే ఉత్తర కొరియా పై అందరికి ఆసక్తి ఉన్నాఎవరికి ఎలాంటి సమాచారం అందడం లేదు.ఎంతో గుంభనంగా సాగుతున్న అక్కడి వ్యవహారాలపై అమెరికా ఒక కన్ను వేసి ఉంచినా వారికి ఎలాంటి సమాచారం చిక్కడం లేదు. ఉత్తర కొరియా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ముగ్గురు అత్యంత సీనియర్ వైద్య నిపుణులను చైనా పంపించడంతో కిమ్ ఆఖరి ఘడియల్లో కొట్టుమిట్టాడుతున్నారా అనే అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.చైనా నుంచి వెళ్లింది వైద్యులా లేక రాజకీయ పరిశీలకులా అనే విషయం కూడా ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. అయితే మొత్తానికి ముగ్గురు ప్రతినిధులు మాత్రం చైనా నుంచి వెళ్లిన విషయం ఒక్కటే ఖరారు అయింది. ఈ నెల 12న గుండె ఆపరేషన్ అనంతరం కిమ్ కోలుకుంటున్నారని డైలీ ఎన్ కె అనే సియోల్ నుంచి నడిచే ఒక వెబ్ సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కిమ్ అత్యంత సీరియస్ గా ఉన్నారనే వార్తలను విశ్వసించడం లేదు.అయితే తాను ఉత్తర కొరియా అధికారులతో మాట్లాడుతున్నదీ లేనిది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. కిమ్ జీవించే ఉన్నారని అయితే బహిరంగంగా కనిపించడం లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి. ఏప్రిల్ 11న ఒక అధికారిక సమావేశంలో పాల్గొన్న కిమ్ ఆ తర్వాత కనిపించలేదని చెబుతున్నారు.ఏప్రిల్ 15న జరిగిన ఆయన తాత కిమ్ 2 సంగ్ జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవంలో కూడా ఆయన పాల్గొన్నట్లు చెబుతున్నారు. 36 ఏళ్ల కిమ్ 2014 లో కూడా ఇదే విధంగా నెల రోజుల పాటు అదృశ్యం అయ్యారు. అతి ఎక్కువగా సిగరెట్టు తాగే అలవాటు ఉన్న కిమ్ ఇటీవల అదుపు కానంత బరువు పెరిగారు. ఇవి గుండె సమస్యలకు దారితీసింది.
 

Related Posts