ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా.. దత్తాత్రేయ
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీకి ప్రత్యామ్నాయం అని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ దత్తాత్రేయ అన్నారు. తెలంగాణకు 24గంటల విద్యుత్ ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి మారుతున్నారనే విషయంపై తాను మాట్లాడబోనని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యధిక సాయం చేసిందని రెండేళ్లలో మిషన్ భగీరథకు రూ.3,900కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 677 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుల వేగవంతానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. తాను గవర్నర్‌గా వెళ్లబోనని, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేస్తూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపారు.