YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

మన్మోహన్ సింగ్ గా అనుపమ్ ఖేర్!!

మన్మోహన్ సింగ్ గా అనుపమ్ ఖేర్!!
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కుతోంది. సీనియర్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ దీంట్లో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.సంజయ్‌బారు రాసిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని ఆయన ట్వీట్ చేశారు.ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ను పంచుకోవడం సంతోషంగా ఉందని అనుపమ్ పేర్కొన్నారు. . ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించడం తనకు సవాల్‌ లాంటిందన్నారు. చిత్రంలో సంజయ్‌బారుగా అక్షయ్‌ ఖన్నా, సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ అలరించనున్నారు.రాహుల్ పాత్ర ఎవ‌రు పోషిస్తున్నార‌నేది తెలియాల్సి ఉంది. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.కొద్ది నెలలుగా ఆయన గురించి స్టడీ చేస్తున్నా. మన్మోహన్‌ పాత్రను ఆకళింపు చేసుకుంటున్నా. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తున్నా’ అని అనుపమ్‌ ఖేర్ రాసుకొచ్చారు.

Related Posts