కరోనా మళ్ళీ రాదని గ్యారంటీ లేదు ... ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారికి కరోనా మళ్ళీ రాదని గ్యారంటీ లేదు.కోలుకున్న వారికి ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్న వివిధ దేశాల తీరుని జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇస్తున్న తీరుని తప్పు పట్టింది. కోవిడ్ వ్యాధి మళ్లీ తిరగబెట్టదని ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆఫీసులకి వెళ్లడానికి, ప్రయాణాలు చేయడానికి వీలుగా చిలీ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాయి. అయితే, వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఇప్పుడే గ్యారంటీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.