వార్తలు సినిమా తెలంగాణ
రోజుకో బాంబు పేలుస్తున్న శ్రీ రెడ్డి... ఇప్పుడు మరో స్టార్ ను టార్గెట్ చేసింది. “కొమ్ములు తిరిగిన శేఖరుడు” అంటూ శేఖర్ కమ్ముల మీద విరుచుకుపడిన శ్రీ.... ఆయన రివర్స్ కావడంతో యూ టర్న్ తీసుకుంది. ఇప్పుడు కొత్తగా “నేచురల్” స్టార్ ను టార్గెట్ చేసేసింది. ఇంతకీ శ్రీరెడ్డి ఏమందంటే – ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు. చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో నీవు సక్సెస్ అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధింపబడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’ అంటూ ఘాటూగా ట్వీట్ చేసింది. ఇప్పుడా నేచురల్ స్టార్ ఏం సమాధానం ఇస్తాడో చూడాలి..
శ్రీ రెడ్డి లీక్స్... పార్ట్ 4 టార్గెట్ నేచరుల్ స్టార్!!