ఆధునిక నియంత కిమ్ మరణం మిస్టరీగా మారింది ? మరణించారంటూ చెపుతున్న చైనా , జపాన్
ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్ మరణించారా? అవుననే సమాధానం? జపాన్‌కు చెందిన షుకాన్ జెండల్ అనే మేగజైన్ కూడా కిమ్ వెజిటేటివ్ స్థాయిలో ఉన్నారని పేర్కొంది. కిమ్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా దిగజారిందనే కారణంతో చైనా ఓ ప్రత్యేకంగా డాక్టర్ల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన మరణించినట్లు అదే దేశానికి చెందిన మీడియా వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఉత్తర కొరియాకు చెందిన అత్యున్నత అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి కిమ్ కన్నుమూశారని పేర్కొంది. ఇదే విషయాన్ని చైనా టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో పోస్ట్ చేశారు. ఈ శాటిలైట్ టీవీ వైస్ డైరెక్టర్ షిజియాన్ గ్జిన్గ్‌ఝౌ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా మీడియా. చైనా ఆర్థిక రాజధాని హాంగ్‌కాంగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న హెచ్‌కేఎస్‌టీవీ హాంగ్‌కాంగ్ శాటిలైట్ టెలివిజన్ ఛానల్.. కిమ్‌జొంగ్ మరణించాడని వెల్లడించింది.