కృష్ణ జింక వేట కేసులో సల్మాన్ ఖాన్ కి శిక్ష విధించి జోధ్ పూర్ సెంట్రల్ జైలు కి తరలించిన సంగతి తెలిసిందే. అయన కి ఖైదీ నెంబర్ 106 ను జైలు అధికారులు కేటాయించారు. సల్మాన్ ఉన్న వార్డ్ పరిసర ప్రాతంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఎరపాటు చేసారు. ఆయన ఉన్న సెల్ లో ఒక చెక్క బల్ల, దుప్పటి, ఒక కూలర్ ను జైలు సిబ్బంది ఎరపాటు చేసారు. పోలీసులు తినడానికి రొట్టెలు , పప్పు మాత్రమే ఇచ్చారని వాటిని సల్మాన్ తిరస్కరించినట్లు తెలిసింది. ఈ రోజు బెయిల్ వస్తుంది అని సల్మాన్ చాలా ఆశ తో ఎదురుచూస్తునాడు. సల్మాన్ తరపు న్యాయవాదులు కూడా బెయిల్ కి తీవ్రంగా ప్రయతినిస్తున్నారు.