YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం....రెండు కుంపట్లు

కమలం....రెండు కుంపట్లు

కమలం....రెండు కుంపట్లు
గుంటూరు, ఏప్రిల్ 27
సీపీకి లోపాయికారిగా సహకరిస్తున్న వారు ఎవరు? ఢిల్లీలో ఉంటూ బీజేపీ నేతల విష‍యంలోనే లీకులిస్తుంది ఎవరు? ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే అందరి వేళ్లూ ఒకరివైపే చూపిస్తున్నాయి. ఇటీవల విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన ఆరోపణల వెనక కూడా ఆ బీజేపీ నేత ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర పార్టీ ఎంత నిధులు పంపించిందీ? ఏపీలో దానిని ఎలా వాడిందీ? తదితర విషయాలను విజయసాయిరెడ్డి చెవిలో ఊదింది ఏపీకి చెందిన ఢిల్లీ బీజేపీ నేత అన్న టాక్ బలంగా విన్పిస్తుంది.ఏపీ బీజేపీలో తొలి నుంచి రెండు వర్గాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు ఉన్నప్పటి నుంచి కళ్లకు కనపడుతుంది. బీజేపీలోని ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకిస్తుంది. టీడీపీ, బీజేపీలు కలసి ఉన్నప్పటి నుంచీ ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు. కేంద్ర నాయకత్వం కూడా వీటిని చూసీ చూడనట్లు వదిలేసింది. అంతే తప్ప ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పెద్దగా పట్టించుకోలేదు. కంభంపాటి హరిబాబు స్థానంలో కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు.ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. కానీ కాలక్రమంలో ఆయన కూడా ఒక వర్గంగా ముద్రపడిపోయారు. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేతలు మాత్రం ఇప్పటికీ టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీని ఏపీలో బలపడనివ్వకుండా చేసింది చంద్రబాబు అన్న భావనలో వారు సైకిల్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారు వైసీపీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతున్నారు. ఇక మిగిలిన పార్టీల నుంచి వచ్చిన నేతలు మాత్రం చంద్రబాబు పట్ల కొంత సానుకూలతతోనే ఉన్నారుఇక ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో రెండు వర్గాలూ పూర్తిగా బయటపడినట్లయింది. పార్టీ అంతర్గత విషయాలను బయట వ్యక్తులకు చేరవేయడం పట్ల ఇప్పటికే ఒక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఉండి ఏపీ పార్టీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారని, వారిని కట్టడి చేయాలని ఇటీవల కన్నా వర్గం కేంద్ర నాయకత్వానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఇలా ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏమీ లేని చోట చర్యలెందుకని అధిష్టానం ఎప్పటిలాగే చూసీ చూడనట్లు ఊరుకుంటుందా? లేక బలపడాలని చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

Related Posts