YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాళ్లిద్దరి మాటే...చెల్లుబాట

వాళ్లిద్దరి మాటే...చెల్లుబాట

వాళ్లిద్దరి మాటే...చెల్లుబాట
విజయవాడ, ఏప్రిల్ 27
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ ఒకేలా వ్యవహరిస్తారన్నది నిజం. ఆయన తన పార్టీ నేతలను వరసబెట్టి వెళుతున్నా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆందోళన చెందలేదు. 2019 ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. పార్టీని స్థాపించి దాదాపు పదేళ్లు కావస్తుంది. ఈ పదేళ్ల కాలంలో జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గత పదినెలలు మినహాయించి ఆయన పార్టీ కార్యాలయంలో ఎప్పుడూ కుదురుగా ఉండలేదు. జనం మధ్యనే ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించారు.అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ కు సలహాలు, సూచనలు ఇవ్వడం కానివ్వండి. పాదయాత్ర మొదలుకొన అభ్యర్థుల ఎంపిక వరకూ ఆ నలుగురే జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రధానంగా ఉన్నారు. వీరిలో తలశిల రఘురాం కేవలం జగన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఉమ్మారెడ్డి కొన్ని విషయాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటారు. ఇక మిగిలిన విజయసాయిరెడ్డి, మాత్రం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాకుండా కీలక నిర్ణయాల్లో సయితం భాగస్వామ్యులుగా ఉన్నారు.పాదయాత్ర దగ్గర నుంచి జగన్ గెలుపు వరకూ వీరిదే కీలక పాత్ర. ఇది పార్టీలో అందరూ అంగీకరించే అంశమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి జరిగినా పెద్దగా పట్టించకోరు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఈ ఇద్దరి మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారుల సలహాలను కూడా జగన్ పక్కన పెట్టేస్తున్నారట. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన సూచనను కూడా జగన్ పట్టించుకోవడం లేదంటున్నారు.వెంటనే విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి హైదరాబాద్ నుంచి మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డిని పిలిపించారు. ఆయన సలహాతోనే చట్ట సవరణ చేశారట. కరోనా సమయంలో కొద్దికాలం ఆగుదామని చెప్పిన ఆ సీనియర్ నేత సలహాను జగన్ ను పట్టించుకోకపోయినా, ఈ కీలక నేతలిద్దరూ నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదంటున్నారు. కనగరాజ్ ఎంపిక కూడా విజయసాయిరెడ్డి ఛాయిస్ అన్న టాక్ బలంగా విన్పిస్తుంది. అధికారంలో ఉన్నా ఈ ఇద్దరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొత్త వ్యక్తులకు చోటు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది జగన్ దృష్టికి వెళ్లడం లేదంటున్నారు.

Related Posts