YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ తర్వాత ఏం చేయాలి...

లాక్ డౌన్ తర్వాత ఏం చేయాలి...

లాక్ డౌన్ తర్వాత ఏం చేయాలి...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27
లాక్ డౌన్ తరువాత ఏం చేయాలి ? ఎలా కరోనాను కంట్రోల్ చేసుకుంటూ విధులు నిర్వర్తించాలి ? ఇదే ఇప్పుడు అందరిలో ఉదయిస్తున్న ప్రశ్న. దీనికి పలువురు నిపుణులు వివిధ రూపాల్లో సలహాలు అందిస్తున్నారు. క్రమంగా నిబంధనలు సడలిస్తూ వెళ్లక పోతే దేశంలో ఆర్ధిక గమనం కుదేలు కానుంది. అంతే కాదు కరోనా వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కన్నా పేదరికంతో నిండిన దేశం కావడంతో ఆకలిచావులు అంతకన్నా ఎక్కువే సంభవించే ప్రమాదం పొంచివుందని చెబుతున్నారు.కరోనాతో దేశవాసులు వ్యాక్సిన్ వచ్చేవరకు మరో ఏడాదో, రెండేళ్లో… స్వీయ పరిమిత లాక్ డౌన్ నిబంధనలను పాటించక తప్పని పరిస్థితి. దీంతో నిరంతర నిఘా కొనసాగించాలిసిందే. డోర్ టూ డోర్ హెల్త్ చెక్ అప్ చేయలిసిందే. ప్రస్తుతం ఇలాంటి సర్వేలు కొనసాగించడానికి దేశం మొత్తం మీద ఏపీ లో వైసిపి సర్కార్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవకాశం ఉంది. అయితే వీరికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వలిసివుంది. అలాగే ఆశా వర్కర్ లు కూడా కరోనా పై దీర్ఘకాల యుద్ధంలో ఇక పై కీలక భూమిక పోషించకతప్పదు. గతంలో మలేరియా కంట్రోల్ చేసేందుకు నిరంతరం ఇంటింటి సర్వే కొనసాగించేవారు. అదే తీరులో ఇప్పుడు కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ఆరోగ్య నిఘా ఏర్పాటు చేయాలిసిందే.అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి నగరాలు, పట్టణాల్లో దూకుడు గా వుంది. గ్రామీణా భారతంలో వైరస్ పాజిటివ్ కేసులు బహుతక్కువ కనుక పట్టణం నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి పట్టణాలకు అతి తక్కువ మాత్రమే వెళ్లివచ్చే నిబంధనలు తీసుకువస్తే మంచిదంటున్నారు నిపుణులు. మురికివాడల ప్రక్షాళనకు ప్రభుత్వాలు కృషి చేయాల్సివుంది. ఇక కరోనా పరీక్షలు విరివిగా కొనసాగిస్తూనే ఉండాలి. వృద్ధులు బయటకు రాకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఆరోగ్య పథకాలు మెరుగు పరచాలి. ఆర్ధిక రక్షణ అన్ని వర్గాలకు కల్పించడం, ప్రజల్లో ఇమ్యూనిటీ మరింత పెంచే చర్యలు నిరంతరాయంగా చేపట్టాలి అన్నది నిపుణుల సూచన.
 

Related Posts