YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
హైద్రాబాద్, ఏప్రిల్ 27
ధాన్యం అమ్మడానికే కాదు...డబ్బుల కోసం కూడా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేసిన 48 గంటల్లో డబ్బులు అందజేస్తామన్న ప్రభుత్వం...ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధాన్యం అమ్మి 16 రోజులు కావాస్తున్నా డబ్బులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 71 మండలాల్లో 8.89లక్షల ఎకరాల వరి సాగైంది. రబీ సీజన్‌లో నీటి సదుపాయం పెరగడంతో 18 లక్షల 85 వేల 278 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 13.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు నల్లగొండ జిల్లాల్లో 275 కొనుగోలు కేంద్రాలకుగాను 274, సూర్యాపేటలో 315కుగాను 291, యాదాద్రి జిల్లాల్లో 277కు గాను 238 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, ధాన్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసేందుకు ట్యాబ్‌లను సకాలంలో అందించలేదు. ట్యాబ్‌ను ఎలా వాడాలన్న దానిపై నిర్వాహకులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ జాప్యానికి కారణమవుతోంది. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు తర్వాత రైస్‌మిల్లుకు చేరాక ఆ రైతుకు సంబంధించిన వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు సమస్యతోనూ ఆన్‌లైన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కారణాల వల్ల రైతులకు ధాన్యం డబ్బులు అందడంలో ఆలస్యమవుతోందని ఓ అధికారి చెప్పారు. నాలుగురోజుల కింద భువనగిరి మండలంలో 11 ఐకేపీ కేంద్రాలు ప్రారంభించగా, శుక్రవారం వారికి ట్యాబ్‌లు అందించారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,91,933 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1835 చొప్పున రూ.53.56 కోట్లు రావాల్సి ఉంది. మొత్తం 39,884 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే కొనుగోళ్లు పూర్తయి 15 రోజులు గడిచిపోతున్నా ఇంత వరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకాలేదు. దీంతో కోత మిషన్‌ ఖర్చు, ఇతర ఖర్చులకు రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మిల్లర్ల కొర్రీలపై ఆవేదన రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో వరంగల్‌లోని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లారు. కాని రెండు రోజులుగా మిల్లర్లు కొర్రీలు పెడుతూ దిగుమతి చేసుకోవడం లేదు. 40 కేజీల బస్తాకు మూడు నుంచి ఐదు కేజీల ధాన్యం తరుగు తీసేసి దింపుకుంటామని, లేకుంటే వెనక్కి తీసుకెళ్లాలంటున్నారు. దీంతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని బుగ్గపాడు, కాకర్లపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన  రైతులు ఆందోళన చెందుతున్నారు.

Related Posts