YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సమ్మర్ లో ద్రాక్షే...రక్ష

సమ్మర్ లో ద్రాక్షే...రక్ష

సమ్మర్ లో ద్రాక్షే...రక్ష
నల్గొండ, ఏప్రిల్ 27
వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా చేసే ద్రాక్ష పండ్ల వెనుక మరెన్నో లాభాలున్నాయి. సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బుల నివారణలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే చక్కని రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ద్రాక్షలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.ఎన్నోరకాల జబ్బుల నివారణలో ద్రాక్షపండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే చేసుకునే చిట్కావైద్యాలకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. బాగా పండిన ద్రాక్ష పండు పార్శ్వ‌పు తలనొప్పి (మైగ్రేన్)కి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే పరగడపున నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండుద్రాక్షల్లో రెయిసిన్స్ ఉంటాయి. ఇవి మంచి పోషకపదార్థాలు. మలబద్దకం, అసిడోసిస్, రక్తహీనత, జ్వరాలు, లైంగిక సమస్యలను తగ్గించడంలో, నేత్ర ఆరోగ్య పరిరక్షణలో ఇవి సహకరిస్తాయి.ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవ‌నాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయస్సు మీద ప‌డ‌డం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష తొక్క‌లో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. క్షీరగ్రంథుల కణితుల పెరుగుదలపై దీని ప్రభావాన్ని ఎలుకలపై చేసిన ప్రయోగాలు నిర్ధారించాయి. ద్రాక్షరసం ఇచ్చిన తరువాత ఎలుకల క్షీరగ్రంథుల క్యాన్సర్ కణాలు గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో గమనించారు. ద్రాక్షల్లోని రిస్‌వెరటాల్ చూపించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్‌వెరటాల్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంథ్రోసయనిన్లు యాంటీ ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.

Related Posts