YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

బేగంబజార్ ను ఒక్కసారి..ఊహించు కుంటే..

బేగంబజార్ ను ఒక్కసారి..ఊహించు కుంటే..

బేగంబజార్ ను ఒక్కసారి..ఊహించు కుంటే..
     లాక్ డౌన్ లో హైదరాబాద్ లోని బేగంబజార్ దుస్థితి
హైదరాబాద్ ఏప్రిల్ 27
రంజాన్ షాపింగ్ పేరుతో హైదరాబాద్ లో జనం పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. హైదరాబాద్ లోని బేగంబజార్ రంజాన్ సందర్భంగా ఆహార పదార్ధాల షాపింగ్ కు ప్రధాన కేంద్రం. బేగం బజాజ్ నుంచి రిటైల్ షాపులు వారు హోల్ సేల్ రేట్లకు కొనుగోలు చేస్తారు. రంజాన్ సందర్భంగా కొనుగోలు పెద్ద ఎత్తున సాగుతుందనే ఉద్దేశ్యంతో బేగంబజార్ హోల్ సేల్ యజమానుదారులు కూడా దుకాణాలు తెరచి పెద్ద ఎత్తున వస్తున్న కష్టమర్లకు సరకులు అమ్ముతున్నారు. అంతే కాదు ఈ నెల మొత్తం కావాల్సిన సరకుల కోసం పెద్ద పెద్ద కుటుంబాల వారు కూడా ఇక్కడకే వచ్చి కొనుగోలు చేస్తారు. చాలా సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నందున ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నా కూడా ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు.రంజాన్ సందర్భంగా కొనుగోలు పెద్ద ఎత్తున సాగుతుందనే ఉద్దేశ్యంతో బేగంబజార్ హోల్ సేల్ యజమానుదారులు కూడా దుకాణాలు తెరచి పెద్ద ఎత్తున వస్తున్న కష్టమర్లకు సరకులు అమ్ముతున్నారు. ఒక్క సారి…. ఊహించు కుంటే.. ఈ జనంలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా ఏమౌతుందో? రంజాన్ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించి వెసులు బాటు కల్పించడంతో హైదరాబాద్ పోలీసులకు కూడా ఈ జనాభాను అదుపు చేయడం కష్టమౌతోంది.

Related Posts