YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కార్వాన్ నియోజక వర్గంలో కరోనా నివారణ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

కార్వాన్ నియోజక వర్గంలో కరోనా నివారణ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

కార్వాన్ నియోజక వర్గంలో కరోనా నివారణ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
    బిజెపి కార్వాన్ నియోజక వర్గ ఇంచార్జ్ ఠాకూర్ అమర్ సింగ్ డిమాండ్
హైదరాబాద్ ఏప్రిల్ 27
కార్వాన్ నియోజక వర్గంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించెందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యా న్మయ చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ,కార్వాన్ నియోజక వర్గ ఇంచార్జ్ ఠాకూర్ అమర్ సింగ్ డిమాండ్ చేసారు.కార్వాన్ నియోజక వర్గం లోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగటం పట్ల ఆయన అందోళన వ్యక్తం చేసారు.ఈ మేరకు నియోజక వర్గం పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో కార్వాన్ నియోజక వర్గ కన్వీనర్ గోవర్ధన్ తో కలిసి మాట్లాడారు. కార్వాన్,జియాగుడ డివిజన్స్ లలో ఇప్పటి వరకు 20 మందికి కరోన పాజిటివ్ వచ్చిందని  ఆయన ఆంధోలన  వ్యక్తం చేశారు.వీరిలో పిల్లలు వృద్ధులు ఉండటం బాదాకారమన్నారు. మరిన్ని కేసులు పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.ఈ క్రమం లో పోలీసులు,వైద్య సిబ్బంది తమ కుటుంబాలను వదిలి నిద్రాహారాలు మాని వ్యాది నివారణకు ఎంతో కృషి చేస్తున్నారని  ఈ సందర్బంగా వారిని అమర్  సింగ్ అభినందించారు. కానీ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తి లో లాక్ డౌన్ సక్రమంగా అమలు కావడం లేదని అది కేవలం మేయిన్ రోడ్లకే పరిమితం అయ్యిందన్నారు.గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్ల పైకి వచ్చి సామాజిక  డిస్టన్స్ పాటించడం లేదని దీనితో వైరల్ మరింత ప్రబలే ప్రమాదం లెకపోలేదన్నారు. పలు ప్రాంతాలలో వ్యాపార,వాణిజ్య సంస్థలు తెరిచి ఉంటున్నాయని, వెంటానే ప్రభుత్వం స్పందించి అవసరమైతే మరింత పోలీసు బలగాలను రప్పించి వీలైనన్ని చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ ను మరింత పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకోవాలని అమర్ సింగ్ డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో,పార్టీ నేతలు జి.శివరత్నం,యోగిరాజ్ సింగ్,విజయ్,ముల్లాబిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
 

 

Related Posts