మాస్క్ లేదని దాడి..యువకుడికి తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 27
స్నేహితుడి ఇంటికి వెళ్ళిన యువకుడిని మాస్క్ లేదని జరిగిన దాడి ఘటణ ప్రాణాపాయ స్థితికి చేర్చింది. తీవ్ర గాయాలైన యువకుడి పరిస్తితి విషమించటం తో కొత్తగూడెం నుండి ఖమ్మం ఆసుపత్రి కి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి లో దారుణం చోటుచేసుకున్నది. కరోనా తో జనం లో భయం దాడికి దారితీసినది. మండలం లోని చాతకొండ గ్రామం లో సునిల్ అనే యువకుడు ముఖానికి మాస్క్ లేకుండా స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. మాస్క్ లేదనే నేపంతో గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సునీల్ పై దాడికి దిగారు. అడ్డువచ్చిన వారిని నిలువరించి దాడి చేశారు. దాడి లో సునీల్ కు తీవ్రగాయాలయ్యాయి. తల నుండి తీవ్ర రక్తశ్రావం కావటం తో కుప్పకూలాడు. స్తానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్‌సలానికి ట్రైనీ ఐపియస్ రోహిత్ రాజ్ చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులపై బాదితుడి బందువులు పిర్యాదు చేశారు. కరోనా వేళ సున్నిత మైన విషయం పెను వివాదానికి దారి తీసి యువకుడి ప్రాణానికి ముప్పు చేకూరేలా చేసింది. గ్రామం లో ట్రైనీ ఐపిఎస్ రోహిత్ రాజ్ పరిస్తితులను సమీక్షిస్తున్నారు. సునీల్ పరిస్థితి విషమించటం తో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం మమత ఆసుత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై లక్ష్మీదేవిపల్లి పోలీసుల కేసులు నమోదు చేశారు.