అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.
పాములపాడు ఏప్రిల్ 27
పాములపాడు మండల కేంద్రం లోని వివిధ గ్రామాలలో నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు అంటూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పాములపాడు తహసిల్దార్ కార్యాలయంలో కిరాణం మరియు కూరగాయల దుకాణాలు యజమానులతో ఎమ్మార్వో రాజేశ్వరి, ఎస్సై రాజ్ కుమార్ , సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా కిరాణం దుకాణాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయి వారు తెలియజేశారు ఎంఆర్పి కంటే ఎక్కువ వస్తువులు అమ్మిన షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించారు లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నిత్యవసర వస్తువులు అధిక ధరలకు ఎలా విక్రయిస్తున్నారని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు