YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

రైతులకు ఇబ్బందులు పెడుతే చర్యలు తప్పువు

రైతులకు ఇబ్బందులు పెడుతే చర్యలు తప్పువు

రైతులకు ఇబ్బందులు పెడుతే చర్యలు తప్పువు
జిల్లా కలెక్టర్ గోగులోతు రవి
జగిత్యాల, ఏప్రిల్ 27
వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్ల దించుకోకుండా రైతులకు ఇబ్బందులు పెడితే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగులోతు రవి తెలిపారు.సోమవారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రైస్ మిల్లర్ లతో  కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గోగులోతు . రవి సమీక్షించారు. ఈ సందర్భంగా మిల్లర్ల తో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి హార్వెస్టింగ్ చేశారని, ఇప్పటివరకు వచ్చిన ధాన్యాన్ని రైతులు శుభ్రం చేసి, క్వాలిటీ వాటిని కొనుగోలు కేంద్రాల తీసుకువస్తున్నారని ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లు దించుకోవాలని అన్నారు. రైస్ మిల్లర్లు కావలసిన హమాలీల ఏర్పాటు చేసుకోవాలని, మీకు కేటాయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తప్పకుండా తీసుకోవాలని అన్నారు. శుభ్రం చేసి వచ్చిన ధాన్యాన్ని వెంటనే  అన్లోడ్ చేసే విధంగా తగ్గి నంత హమాలీ లను ఏర్పాటు చేసుకోవాలని, చేసుకొని ధాన్యాన్ని వెంటనే దించు కోవాలని అన్నారు. ధాన్యాన్ని దించు కోకుండా ఇబ్బందులు పెడితే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశములో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజేశం, రైస్ మిల్లర్ల నాయకులు విష్ణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts