YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు పార్టీ కార్యాలయం లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్

ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు పార్టీ కార్యాలయం లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్

ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు
పార్టీ కార్యాలయం లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల ఏప్రిల్ 27
జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యే జెండాను జడ్పీ చైర్ పర్సన్  దావా వసంత సురేష్ ,మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ లతో కలసి ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన తొలి ఉద్యమం కన్నా మలిదశ ఉద్యమం విభిన్నమైందన్నారు. ఆత్మ బలిదానాలు, ప్రాణత్యాగాలు, అడ్డంకులు , బెదిరింపులు అన్నింటిని తట్టుకొని పార్టీని ముందుకు నడిపించిన ఘనత కేసీఆర్ దేనని ఆన్నారు. గత 2001లో కొందరు సహచరులతో కలిసి స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఆని ఆన్నారు. సంపూర్ణ మెజారిటీతో రెండు సార్ల తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికే ఆదర్శం ఆని ఆన్నారు. తెలంగాణ వస్తే 24 గంటల కరేంట్ ,కోటి ఎకరాలకు నీరు, ఆసరా, బీడీ కార్మికులకు పెన్షన్లు గురుకులాలు, పేదలకు మంచి వైద్యం, తాగు, సాగు నీరు రాష్ట్రంలో ఉంటుందని తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తాయని, వచ్చాయని నిరూపించిన నాయకుడు కేసిఆర్ ఆన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోని 2 లక్షల 47 వేలు ఎకరాలలో వ్యవసాయం సాగైనదని అలాగే కేసిఆర్ పాలనలో అనేక మంది యువత నాయకులు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో సభ్యులుగా చేరారన్నారు. రాష్ట్రంలో 60 లక్షలు సభ్యత్వాలు జగిత్యాలలో యాభై ఐదు వేలకు పైగా సభ్యత్వాలు నమోదైందని ఆన్నారు. మాజీ ఎంపీ కవిత  సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా నిధులను తీసుకువచ్చి అన్ని రకాలుగా పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించిందని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్ణయాలతో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టిందని మన జగిత్యాలలో కరోనా కేసు ఒక్కటి కూడా లేదన్నారు. అలాగే టీ ఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తోచిన సహాయం నిరుపేదలకు ,వలస కూలీలకు అందించాలనన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ ,ఎంపీపీ గంగారాం గౌడ్,వైస్ ఎంపీపీ రాజు,జడ్పీటీసీ మహేష్,మున్సిపల్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్,సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts