కోటా నుంచి గువాహతి చేరుకున్న 391 మంది విద్యార్థులు
గువాహతి ఏప్రిల్ 27
రాజస్థాన్‌లోని కోటా నుంచి సుమారు 391 మంది విద్యార్థులు ఇవాళ ఉదయం అస్సాంలోని గువాహతి చేరుకున్నారు. అక్కడ ఉన్న సరుజసాయి స్పోర్ట్స్ స్టేడియానికి విద్యార్థులు వచ్చారు. ఆ విద్యార్థులు బస్సుల్లో సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ.. విద్యార్థులను స్టేడియం వద్ద రిసీవ్ చేసుకున్నారు. అయితే విద్యార్థులను అందర్నీ క్వారెంటైన్‌కు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 14 రోజుల పాటు విద్యార్థులు క్వారెంటైన్‌లో ఉంటారని, వారికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కుటుంబసభ్యులకు వైరస్ సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. క్వారెంటైన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతల గురించి కూడా విద్యార్థులకు తెలిపారు.