YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాబోయే రోజుల్లో కూడా కోవిడ్ ప్రభావం నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. ప్రధాని మోదీ

రాబోయే రోజుల్లో కూడా కోవిడ్ ప్రభావం నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. ప్రధాని మోదీ

రాబోయే రోజుల్లో కూడా కోవిడ్ ప్రభావం
       నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. ప్రధాని మోదీ
న్యూఢిల్లీ ఏప్రిల్ 27
రాబోయే రోజుల్లో కూడా కోవిడ్ ప్రభావం కనిపించవచ్చని, ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్లు ధరించడం మన జీవితంలో ఒక భాగం కావచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్-19పై పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 ప్రస్తుత పరిస్థతి, సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్‌లో మోదీ చర్చించారు.'ఇంతవరకూ మనం రెండు లాక్డౌవన్లు చూశాం. ప్రస్తుతం మనం ఏవిధంగా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ ప్రభావం రాబోయే నెలల్లోనూ కనిపిస్తుంది. మునుముందు కూడా రోజువారీ జీవితంలో అంతా మాస్క్‌లు ధరించడం అనివార్యం కావచ్చు' అని మోదీ అన్నారు. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేలాది ప్రాణాలు కాపాడగలిగాం...లాక్‌డౌన్‌తో సానుకూల ఫలితాలు వచ్చాయని, గత నెలన్నరగా వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామని మోదీ చెప్పారు. పలు దేశాల జనాభా అంతా కలిపితే ఎంతో భారత్ జనాభా అంతని అన్నారు. మార్చి ప్రారంభంలో ఇండియాతో సహా చాలా దేశాల్లో పరిస్థితి దాదాపు ఒకేలా ఉందని చెప్పారు. అయితే, భారత్‌లో సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎందరో ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. ఇంతమాత్రంతో సరిపోదని, వైరస్ ప్రమాదంపై నిరంతర నిఘా చాలా అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు.'ప్రస్తుత పరిస్థిత్లో ప్రతి ఒక్కరూ శీఘ్రగతిన స్పందించడం ముఖ్యం. చాలా మంది ప్రజలు దగ్గు, జలులు, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం'  అని ప్రధాని అన్నారు. సాంకేతికతను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని, కోవిడ్-19పై సమర్ధ పోరాటానికి ఊతం ఇస్తూ ఆరోగ్యసేతు యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్‌పై పోరాటంలో ప్రజలు కూడా యూనివర్శిటీలతో భాగస్వాములై  కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు బాసటగా నిలబడాలన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయండి.. హాట్‌స్పాట్‌లు, రెడ్ స్పాట్‌ల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని కూడా ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చే అంశంపై ప్రధాని మాట్లాడుతూ, ఇందువల్ల ప్రవాస భారతీయులకు ఎదురయ్యే ఇబ్బందులు, వారి కుటుంబాలు రిస్క్‌లో పడే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.కాగా, కోవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ జరపడం ఇది నాలుగోసారి. గతంలో మార్చి 20, ఏప్రిల్ 2, ఏప్రిల్ 11 తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు జరిగాయి. మరో వారంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగియాల్సి ఉన్నందున సోమవారంనాడు మరోసారి మోదీ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Related Posts