YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రైతాంగాం ఆందోళన పడొద్దు

రైతాంగాం ఆందోళన పడొద్దు
 

రైతాంగాం ఆందోళన పడొద్దు
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
278 కొనుగోలు కేంద్రాలలో లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తి
692 మంది రైతులకు 7 కోట్ల 62 లక్షల చెల్లింపులు
యాదాద్రి
రైతాంగాం ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సంబంధించి రైస్ మిల్లర్లతో అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. తాజాగా కురిసిన వర్షాలకు కళ్ళల్లో ధాన్యం తడిసిందన్న సమాచారం తో సోమవారం మధ్యాహ్నం బోనగిరి-యాదాద్రి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,డాక్టర్ గాధారి కిశోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. బోనగిరి-యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 278 కొనుగోలు కేంద్రాలలో లక్ష మెట్రిక్ టన్నుల పై చిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. అదే విదంగా 692 మంది రైతులకు ఇప్పటికే 7 కోట్ల 62 లక్షల రూపాయలు చెల్లింపులు జరిగాయాన్నారు. మొత్తం 278 కొనుగోలు కేంద్రాలకు గాను 99 చోట్ల ఐ కే పి కేంద్రాలు ప్రారంభించగా 179 చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. గన్ని బ్యాగుల అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ సరిపడ బ్యాగుల లభ్యత ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి కరోనా వైరస్ పై జరుపుతున్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను అమలు పర్చాల్సిందే నని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts