YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా వెనుక టీడీపీ కుట్ర

కరోనా వెనుక టీడీపీ కుట్ర

కరోనా వెనుక టీడీపీ కుట్ర
విజయవాడ, ఏప్రిల్ 27
ఏపీలో కరోనా రాజకీయం మళ్లీ వేడెక్కింది. రాజ్‌భవన్‌లో నలుగురు సిబ్బందికి పాజిటివ్ తేలిందనే వార్తలతో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై మంత్రి మోపిదేవి వెంకటర రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ ప్రమాణ స్వీకారాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం వల్ల కరోనా పాజిటివ్ వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోందని.. ఇది చిల్లర రాజకీయం అంటూ మండిపడ్డారు.రాష్ట్రంలో కొందరు కరోనాను వ్యాప్తి చేయడానికి స్లీపర్ సెల్స్‌లా తయారయ్యారని మోపిదేవి అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లో కొంతమంది కరోనా స్లీపర్ సెల్స్‌ను గ్రామాల్లో ప్రవేశపెట్టారనే అనుమానం వస్తోందన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే దీని వెనుక టీడీపీ కుట్ర దాగి ఉందేమో అన్నారు. జగన్ పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికి అయినా దిగజారతారనడంలో ఎలాంటి సందేహం లేదు అని వ్యాఖ్యానించారు. అందుకే ఈ దిగజారుడు రాజకీయానికి తెరిలేపారనే అనుమానం వస్తోందన్నారు.అంతకముందు టీడీపీ రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా రావడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రాజ్‌భవన్‌కు వెళ్లారని.. ఈ నెల 11న నూతన రాష్ట్ర ఎన్నికల అధికారిగా ప్రమాణ స్వీకారం చేశారని.. దీని కారణంగా రాజ్ భవన్‌లో పనిచేసి సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో చెన్నై నుంచి కనగరాజ్‌ని ఎలా ఎన్నికల అధికారిగా ప్రమాణం చేయించారో ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.

Related Posts