YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులతో చర్చించక్కరలేదు : నిమ్మగడ్డ

ఉద్యోగులతో చర్చించక్కరలేదు : నిమ్మగడ్డ

ఉద్యోగులతో చర్చించక్కరలేదు : నిమ్మగడ్డ
విజయవాడ, ఏప్రిల్ 27
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు హైకోర్టులో ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై నిమ్మగడ్డ రమేష్ రిప్లై పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషనర్‌ పనుల్లో సాయం చేసేందుకే సెక్రటరీ విధులు పరిమితమని స్పష్టం చేశారు.ఎన్నికల వాయిదా గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్కొన్నారు. ఈసీ న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌ తయారు చేశాకే తాను సంతకం చేశానని వివరించారు. ఎస్ఈసీగా తన విచక్షణాధికారాల మేరకు ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఉంటుందని తెలిపారు.ఎస్‌ఈసీ నిర్ణయాలన్నింటినీ ఈసీ ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ స్పష్టం చేశారు. ఎస్ఈసీ పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తుది అఫిడవిట్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరగనున్నాయి
 

Related Posts