YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముఖ్యమంత్రుల సలహాలు విన్న ప్రధాని

ముఖ్యమంత్రుల సలహాలు విన్న ప్రధాని

ముఖ్యమంత్రుల సలహాలు విన్న ప్రధాని
న్యూఢిల్లీ,ఏప్రిల్ 27
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రులతో లక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ర్టాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో అన్నట్లు తెలిసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని సీఎంలతో మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి గడువు మే 3తో ముగియనున్న నేపథ్యంలో.. ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి సీఎంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మార్చి 22న సమావేశమైన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు.ఏప్రిల్ 14న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తాజా భేటీలో కరోనాను కట్టడి చేస్తూనే దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎలా ఉపసంహరించాలనే విషయమమై ప్రధాని మోదీ, సీఎంల మధ్య చర్చ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లకు ప్రత్యేక ప్రణాళికలు ఉండాలనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయని సమాచారం. గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలస్తోంది. వెంటిలేటర్ల విషయంలో కేంద్రం సహకరించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.ఆదివారం మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం దేశం యుద్ధం మధ్యలో ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.కేసీఆర్, జగన్‌తోపాటు 17 రాష్ట్రాల సీఎంలు ఈ భేటీలో పాల్గొనగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేరళ చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కాగా.. ఆ రాష్ట్రం సూచనలను లేఖ ద్వారా అందించారు.ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 28 వేలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 872కు చేరింది. మహారాష్ట్రలో 440 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 వేలు దాటింది. కోవిడ్ కారణంగా ఈ రాష్ట్రంలో 342 మంది చనిపోయారు
 

Related Posts