YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉద్యమ ప్రస్థానంపై ఫోటోలు రిలీజ్

ఉద్యమ ప్రస్థానంపై ఫోటోలు రిలీజ్

ఉద్యమ ప్రస్థానంపై ఫోటోలు రిలీజ్
హైద్రాబాద్, ఏప్రిల్ 27,
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ సోమవారం 20వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటుంది. అయితే.. కరోనా నీలి నీడలు కమ్ముకున్న తరుణంలో ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఉద్యమ కాలం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ట్విటర్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆసక్తికర కామెంట్లు పెట్టారు. ఉద్యమ ప్రస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు, అరెస్టై ఠాణాలో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.రెండు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణంలో టీఆర్‌ఎస్ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని ప్రజలతో మమేకమై అద్భుతాలను ఆవిష్కరించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు పునరంకితం అవుతున్నట్లు తెలిపారు. జలదృశ్యం నుంచి సుజల దృశ్యం వరకు అంటూ పలు అనుభవాలను గుర్తు చేశారు. ఆరేళ్ల పాలనలో 'ఐదు విప్లవాలు' వచ్చాయని పేర్కొన్నారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. ఉద్యమ సూర్యుడా వందనం.. ‘ఒక్క పిడికిలి బిగిస్తే.. బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది స్పూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం’ అంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వందనం చేస్తున్నట్లు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. గులాబీ జెండా పుట్టిన రోజు పండగ సందర్భంగా ప్రతి గులాబీ సైనికుడికి వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మరో ట్వీట్ చేశారు. ‘తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా.. గుండె గుండెను ఒకటి చేసిన జెండా.. ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా, పేదవాడి ఆకలి తీర్చిన జెండా, రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా.. తెలంగాణా ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా..’ అంటూ టీఆర్‌ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

Related Posts