అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 2016-17 లో వివిధ సంస్తలు కంపెనీల్లో పెట్టిన 8975 కోట్ల పెట్టు బడి పై నామమాత్రంగా నాలుగు కోట్ల ఆదాయం మాత్రమే సాధించిందని తన నివేదికలో కాగ్ పేర్కోంది. 2016-17 లో ఈ పెట్టుబడుల సగటు ప్రతిఫలం రేటు అత్యధికంగా 0.05 మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చ్ 31 నాటికి 768888 కోట్ల రుణ బకాయిలను తీర్చాల్సి ఉంటుందని ఇది ఆయా సంవత్సరాల ప్రభుత్వ బడ్జెట్ ల పై భారాన్ని మోపేలా ఉందని నివేదిక పేర్కోంది. 2017 మార్చి 31కి పూర్తి కావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటి పూర్తి కాలేదని స్పష్టంగా చెప్పింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు 28 వేల కోట్ల రూపాయల మేర పెరిగిపోయాయి. పాత ప్రాజెక్టుల్లో జాప్యం, కొత్త పథకాలు ప్రారంభించకపోవడంతో 2017 మార్చి నాటికి 110 కోట్లు మిగిలిపోయిట్టు కాగ్ స్పష్టంచేసింది. డీపీఆర్ ఆలస్యాల కారణంగా 455 కోట్ల కేంద్ర సాయాన్ని వినియోగించుకోలేకపోయారని తేల్చి చెప్పింది. పనులు పూర్తైనా.. 7 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. మరో 7 పథకాలు మధ్యలో ఆగిపోయాయి. ఫలితంగా 491 కోట్లు వృధా అయ్యాయి. హడావుడి ఖర్చులను 27 నుంచి 50 శాతానికి ప్రభుత్వం పెంచినట్టు కాగ్ తెలిపింది. కేంద్ర ఉదయ్ పధకం కింద ప్రభుత్వం 8256 .01 కోట్లు విడుదల చేయగా 6464.39 కోట్ల మేర లోన్లు ఇంకా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు డిస్కం కొత్తగా ఎలాంటి బాండ్లను జారీ చేయలేదని కాగ్ పేర్కోంది. ఒకవైపు అప్పులు పెరిగిపోతున్నా, ఆర్థిక నియంత్రణ సరిగా లేదని ప్రభుత్వానికి కాగ్ స్పష్టంచేసింది. తీసుకున్న అప్పులపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ.. భారీ మొత్తాలను పీడీ ఖాతాల్లో ఉంచడం పేలవమైన నగదు ద్రవ్య నిర్వహణగా తెలిపింది. పెట్టుబడులపై సగటు ప్రతిఫలం రేటు 0.05 మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక నియమాలు , విధానాలు పాటించకపోవడం ఆర్దిక నియంత్రణ లేకపోవడం వంటి వివిధ సంధర్భాలను ఆడిట్ చాలా సందర్భాల్లో తప్పు బట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ దారుణంగా ఉందని కాగ్ స్పష్టంచేసింది.