కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం గవర్నర్ నరసింహన్ టీఆర్‌ఎస్ ప్రాజెక్టు ఏజెంట్‌లా మాట్లాడారని ఫైర్ అయ్యారు.
రాజకీయ భిక్ష కోసమే గవర్నర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను తెలుసుకోకుండా గవర్నర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల ఆసక్తి, కేసీఆర్‌పై విశ్వాసం ఉంటే గవర్నర్ నరసింహన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నరసింహన్ చేసిన వ్యాఖ్యలు గవర్నర్ హోదాను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.
స్థాయి మరచి మాట్లాడారు.
రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ ఉమ్మడి కరీంనగర్ లో మాట్లాడిన మాటలు గవర్నర్ హోదాను, పదవిని కించపరిచినట్లున్నాయని టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు . గాంధీ భవన్ లో విలేకర్ల సమావేశంలో పార్టీ నేతలు వి. హనుమంతరావు, శ్రీధరబాబులతో కలిసి ఆయన మాట్లాడారు.గవర్నర్.. ఒక పార్టీ, ప్రభుత్వం పై స్థాయి మరచి మాట్లాడారు.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుమీద పెట్టిన ప్రాజెక్టు ను సందర్శించేందుకు వెళ్లి...ఆ పేరును ఎందుకు తీసేశారని ప్రశ్నించక పోవడం విచారకరమన్నారు .అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ప్రారంభించారు.38వేల 500 కోట్ల ప్రారంభమైన ప్రాజెక్టు లో అప్పటికే 10వేలు ఖర్చుచేశారు. ఇప్పుడు కేవలం కాళేశ్వరం గా పేరు మార్చి 80వేల 500కోట్లకు పెంచారు.50వేల కోట్లు వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని అడగాల్సిన గవర్నర్ ఆహా ఓహో అని పొగిడారు.సీఎం కెసిఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర రావు అని, హరీష్ రావు ను కాళేశ్వర రావు అని గవర్నర్ అభివర్ణించారు. ఇవన్నీ చూస్తుంటే రేపు రాజ్ భవన్ ను trs భవన్ అంటారేమో అని బాధకల్గుతుందన్నారు.ప్రాణహిత ప్రాజెక్టు ను జాతీయ ప్రాజెక్టు చేస్తే ఒక్క రూపాయి కూడా కర్చులేకుండా కాళేశ్వరం పూర్తయ్యేది.ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లు మర్చి...సీతారామ ప్రాజెక్టు గా మర్చి...10వేల కోట్లు అదనంగా పెంచారు.ఈ ప్రాజెక్టుల్లో జరిగిన టెండర్ల లో పెరిగిన వాటిని ప్యాకేజ్ వారిగా రాజ్ భవన్ కు పిలిచి రివ్యూ చేయండి. అది మీ బాధ్యత.అని స్పష్టం చేశారు.అలా చేయకుంటే మేం ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రపతిని కలుస్తాం... గవర్నర్ పాత్ర పై పిర్యాదుచేస్తామని చెప్పారు. ఇతర పార్టీల వారిని టీఆరెస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి రాజ్యాంగాన్ని అవమానపరిచారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి..
ప్రాజెక్టుల నిర్మాణంలో 80వేల కోట్ల కుంభకోణం, లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇది కేవలం పేరుమార్చడంతోనే చేశారు.గతంలో సీఎం లు అవినీతికి పాల్పడితే లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది.రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతలా పొగుడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉంది.గవర్నర్ కు cbi వారెంట్ ఇస్స్యూ చేపిస్తాం.ఈ గవర్నర్ పై పీఎం కు పిర్యాదు చేస్తామన్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు తప్పుడు సమాచారమిస్తుంది.ఈ సర్కార్ ఈ ప్రాజెక్టు తో రైతులకు ఏవిధంగా అదుకుంటుంది చెప్పే ప్రయత్నం చేయలేదు.రిలీఫ్ అండ్ రీ హాబీటేషన్ ఎలా జరిగిందో చెప్పలేదు.2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలని కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా అమలుచేయలేదు.ఈ అంశాల పై గవర్నర్ రివ్యూ చేసుంటే బాగుండేది.భూమి నష్టపోయిన రైతులను రాజ్ భవన్ కు పిలిపించి గవర్నర్ వివరాలు తెలుసుకోవాలి.అప్పుడు సర్కార్ నిజ స్వరూపం తెలుస్తుంది.ప్రాణహితను జాతీయ ప్రాజెక్టు నుంచి ఎందుకు తీసేశారని నిలదీశారు.
గవర్నర్ ఏమన్నారంటే..
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా..? కలల చంద్రశేఖర్ రావా..? అనిపించింది. ఇప్పుడు ప్రాజెక్టు చూశాక అభిప్రాయం మారింది. కేసీఆర్.. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా మారిపోయారనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు న భూతో న భవిష్యత్‌లా తయారవుతోంది. మంత్రి హరీశ్‌రావు పేరును కూడా కాళేశ్వర్‌రావుగా చరిత్రకెక్కుతుంది’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.