YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే మేయర్ స్వరూప డిమాండ్

ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే మేయర్ స్వరూప డిమాండ్

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాలుగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేసి తీరాలని నగర మేయర్ మదమంచి స్వరూప కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేయర్ స్వరూప ఆధ్వర్యంలో స్థానిక పాతవూరు గాంధీ విగ్రహం వద్ద వేలాది మంది విద్యార్థులతో కాళీ ప్లేట్లతో డబ్బు కొట్టుకుంటూ ఆకలి కేకలు అనే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆమె కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, విద్యార్థులతో కలిసి గాంధీ విగ్రహానికి క్షీరాభిషేఖం చేశారు. అనంతరం తట్టలు, గరేటలతో డబ్బు కొడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు.. విభజన హామీలు అమలు చేయాలి.. సేవ్ ఆంధ్ర ప్రదేశ్..కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను తక్షణం అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని ఐదు కోట్ల మంది ఆంధ్రుల సాక్షిగా ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకొని తమ నిజాయితీని చాటుకోవాలన్నారు. ఇప్పటికే దేశంలో 12 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, దీని వల్ల ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగుతోందన్నారు. హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, ఏపీ విభజన తర్వాత ఇక్కడ పరిశ్రమలు లేవన్నారు. రాయితీలు ఉంటే పరిశ్రమలు వస్తాయని, అప్పుడు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. రెవెన్యూ లోటు రూ.16500 కోట్లు ఉందని, హోదా వస్తే లోటు భర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, హోదాతోనే విద్యార్థుల భవిష్యత్ కు భరోసా లభిస్తుందన్నారు. లేక పోతే భవిష్యత్ అందకారమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష..విభజన సమయంలో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారని గుర్తు చేశారు. హోదాకై మరో సారి ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయనున్నారన్నారు. కేంద్రం ఇప్పటికైనా తన మొండి వైఖరి మారాలన్నారు. హోదా కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు, మా ఎంపీలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హోదా సాధించే దాకా మా పోరాటం ఆపమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రంగాచారి, నసీమ, కృష్ణకుమార్, మున్వర్, ఆర్య వైశ్య సంఘం నాయకులు వెంకట కృష్ణా, రాము, తెలుగు మహిళా నాయకురాళ్లతో పాటు నగర పాలక పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts