YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేఈ చేరికపై అనుమానాలు

కేఈ చేరికపై అనుమానాలు

కేఈ చేరికపై అనుమానాలు
కర్నూలు, ఏప్రిల్ 28
కేఈ ప్రభాకర్ చేరికపై వైసీపీ నేతలకు అనుమానం వచ్చిందా? ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడిందా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. ప్రధానంగా కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరతారన్న అంశం పార్టీలో చిచ్చురేపింది. ప్రధానంగా డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేఈ ప్రభాకర్ ను పార్టీలో చేర్చుకునేందుకు వీలు లేదని హైకమాండ్ కు కూడా కొందరు నేతలు చెప్పారంటున్నారు.కేఈ ప్రభాకర్ నెలన్నర క్రితం టీడీపీకి రాజీనామ చేశారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్న కేఈ ప్రభాకర్ రాజీనామా నిజంగా సంచలనం కల్గించే అంశమే. కేఈ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వస్తుంది. గతంలో పదేళ్లు అధికారంలో లేకపోయినా కేఈ కుటుంబం పక్క చూపులు చూడలేదు. అలాగే పార్టీ కూడా కేఈ కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది. కేఈ ప్రభాకర్ కు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ కుటుంబానికి పార్టీలో ఉన్న ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పింది.అయితే కేఈ ప్రభాకర్ టీడీపీని వీడటానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు. ఇప్పటికే డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో కేఈ కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలపై వరస కేసులు నమోదవుతున్నాయి. వారిలో కొందరు గ్రామాలను విడిచి వెళ్లగా, మరికొందరు వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లలో పార్టీ క్యాడర్ కకావికలం అవుతుందని భావించిన కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారంటున్నారు.మరోవైపు పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై హత్య కేసు నమోదయి ఉంది. పత్తికొండ ఎమ్మల్యే శ్రీదేవి భర్త నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు నిందితుడు. ఈ కేసు విషయంలోనూ రాజీ కుదుర్చుకునేందుకే కేఈ ప్రభాకర్ వైసీపీకి దగ్గరవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరికకు అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. కరోనా వ్యాధి రాకుంటే కేఈ ప్రభాకర్ వైసీపీ కండువా కప్పుకునే వారు. ఈ గ్యాప్ లో ఆయన చేరకుండా వైసీపీ నేతలు అభ్యంతరం తెలుపుతుండటంతో హైకమాండ్ కూడా ఆలోచనలో పడిందంటున్నారు.
 

Related Posts