YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మంత్రులు, అధికారులకు కనిపించని మాస్క్లు

ఏపీలో మంత్రులు, అధికారులకు కనిపించని మాస్క్లు

ఏపీలో మంత్రులు, అధికారులకు కనిపించని మాస్క్లు
విజయవాడ, ఏప్రిల్ 28,
యథా రాజా తథా ప్రజా అంటారు.కానీ ఏపీలో ప్రజలందరూ మాస్కులతో రోడ్లమీదకు వస్తున్నారు. అధికారులు కూడా తూ.చ తప్పకుండా నియమాలు పాటిస్తున్నారు. కానీ రాజుగారే పాటించడం లేదు. ఏపీ సీఎం జగన్ ఏ ఫోటోలో చూసినా ఒకటే రూపం. నవ్వుతూ కనిపిస్తారు. ఆయన సమీక్షకు వచ్చే అధికారులంతా మాస్కులేసుకుంటారు. కానీ ఆయన ముఖానికి మాస్కు మాత్రం కనిపించదు. కోవిడ్ 19కు ఎవరూ అతీతులు కాదు... సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కరోనా కాటేస్తోంది. దేశాధ్యక్షులను వారి కుటుంబసభ్యులను సైతం వైరస్ వెంటాడిన పరిస్ధితులు విదితమే. ఇటువంటి పరిస్ధితులలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అందుకు ఆంధ్రప్రదేశ్ ఏమీ మినహాయింపు కాదు. కానీ రాష్ట్రంలో నాయకుల పరిస్ధితులు చూస్తుంటే కరోనా మాజోలికి రాదన్నట్లు వ్యవహారిస్తున్నారు. స్వయంగా సీఎం మాస్కు వేసుకోరు. ఇక రాజే అలావుంటే అమాత్యులు ఇంకెలా వుంటారు.వారు కూడా అంతే..  సేమ్ టు సేమ్. కరోనా వైరస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు... ఆ పేరు వింటేనే వణుకు పుడుతోంది. బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. పరిస్ధితుల ప్రభావం... అవసరాలు అలా చేస్తున్నాయో కాని అనేక ప్రాంతాలలో కొందరు ఇప్పటకీ కరోనా నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. సరే సామాన్యులు మద్యతరగతి కుటంబాలకు చెందిన వారి ఆర్ధిక పరిస్ధితుల నేపద్యంలో కొంత నిర్లక్ష్యం చేసారు అనుకుందా కాని అందరకీ ఆదర్శంగా నిలవాల్సిన నేతలే జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి మూతికి మాస్క్ లేదు. వచ్చిన వారితో సోషల్ డిస్టెన్స్ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు నిత్యం వివిధ వర్గాలకు చెందిన వారు సిఎం క్యాంపు కార్యాలయంకు వస్తారు. కరోనా నివారణ చర్యలకు ఫండ్స్ ఇచ్చేందుకు పలువురు వస్తున్నారు. ఒకే వీరందరనీ క్యాంపు కార్యాలయం  బయట చేయాల్సిన మెడికల్ స్ర్కీనింగ్ చేస్తారు.14 రోజుల క్వారంటైన్ లో ఉన్నా బయటపడని ఈ కరోనా 28 రోజుల తర్వాత కలవరం పెడుతోంది. అలాంటి పరిస్ధితులున్నా మన ముఖ్యమంత్రి జగన్ ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు... అయితే సిఎం స్ధాయి వ్యక్తికి మనం చెప్పడం కరెక్టు కాదుగాని... కనీసం మాస్క్ ధరించి... సోషల్ డిస్టెన్స్ పాటిస్తే పదిమందికి ఆదర్శంగా ఉంటుంది... జగనన్న అనే జనం కోసం అయినా ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకోవాలని మనమూ కోరుకుందాం... ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే కోరుకుంటున్నారు....ఆవు చేలో మేస్తే... దూడ గట్టుమీద మేస్తుందా అన్న చందాన ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక మంత్రులు అధికారులు ఎందుకు పాటిస్తారు...  కరోనా వైరస్ నివారణ చర్యలు క్షేత్రస్ధాయిలో ఏలా జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు పలువురు మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. వారు కూడా నామ మాత్రపు జాగ్రత్తలే తీసుకుంటున్నారు.మూతికి పెట్టుకోవాల్సిన మాస్ మెడకుంటుంది. చేతికి గ్లౌజులుండవు, సోషల్ డిస్టెన్స్ అసలేం ఉండదు. అమాత్యులు పెట్టుకోకపోతే ఏమి బాగుంటుంది అన్నట్లు చుట్టూ ఉన్నవారు కూడా పెట్టుకోవాలని ఉన్నా పెట్టుకోవడం లేదు. మంత్రులే కాదు ఉన్నతాధికారులు సైతం ఇదే బాటలో ఉన్నారు. సాక్షాత్తు డిజిపీ గౌతం సవాంగ్ యాప్ రిలీజ్ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అందులో పరిస్ధితి చూస్తే మనం ఎక్కడ ఉన్నామనిపిస్తుంది.ఇది ఒక్క డిజిపి మీడియా సమావేశమే కాదు... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఇంకోకరు ఇంకోకరు పెట్టినా ఇదే పరిస్ధితి. మంత్రులు సిఎం దగ్గరకు వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు పాటించకపోవడం ప్రజలకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్లె అవకాశం ఉంది... వైద్యులు మాత్రం ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఈ వ్యాధికి అదొక్కడే నివారణ మార్గం అంటున్నారు...

Related Posts