శ్రీ శంకరభుజంగ ౼ ప్రయాతపంచరత్న స్తోత్రం
1) శోకరోగమోహనాశజ్ఞానబోధశంకరం
ఖండితాగ్రపరశుశూలపాశధారిశంకరం
పార్వతీహృదయవిహరమత్తభృంగశంకరం
భానుకోటిభాసమానభక్తవంద్యశంకరం ||
2) చంద్రచూడవేదవేద్యవందితాంఘ్రిశంకరం
పృథివ్యాపఅగ్నివాయుదహరరూపశంకరం
దేవకోటిపూజ్యమానదేవదేవశంకరం
విశ్వవ్యాప్తకీర్తిదేహనీలకంఠశంకరం ||
3) యజ్ఞదహనకామదహనతాపదహనశంకరం
సామగానమత్తలోలధ్యానమగ్నశంకరం
భావరాగతాళవాద్యనాదబిందుశంకరం
శృంగిభృంగినందికేశవందనీయశంకరం ||
4) పద్యగద్యనాట్యకావ్యగానముదితశంకరం
ఢమరువాద్యనాదమోదకాలకాలశంకరం
లోహితాక్షధవళవర్ణసకలలోకశంకరం
పంచేద్రియపాలకేంద్రపంచాననశంకరం ||
5) పంచమహాపాపనాశలింగరూపశంకరం
భస్మభూషగంగధార్యపినాకధన్వశంకరం
యోగగమ్యయోగనిష్ఠయోగసిద్ధిశంకరం
వారణాసిక్షేత్రవాసవిశ్వనాథశంకరం ||
*సర్వం శ్రీశంకర దివ్యచరణారవిందార్పణమస్తు*
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో