YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

ఇంకొన్నాళ్లు..కరోనా తప్పదా...

ఇంకొన్నాళ్లు..కరోనా తప్పదా...

ఇంకొన్నాళ్లు..కరోనా తప్పదా...
విజయవాడ, ఏప్రిల్ 28
రాశి చక్రంలో కర్కాటక, వృశ్చిక, మకర రాశుల్లో అంటే.. మేషం నుంచి 4, 8, 10 స్థానాల్లో శని సంచార సమయంలో శనికి కుజుడు యతి రూపంలో తోడుగా వచ్చిన సమయంలో కొన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయి. ఆ ఉపద్రవాలు కింది విధంగా ఉంటాయి.
1. కర్కాటక రాశిలో శని సంచార సమంలో అనగా.. 10 డిగ్రీల లోపల ప్రవేశించిన సమయంలో వరహ రూపంలో ఉంటాడు. ఈ సమయంలో కుజుడు యతి రూపంలో అంటే.. సన్యాసి రూపంలో తోడుగా చేరిన సమయంలో రోగ ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో కోతుల నుంచి, పందుల నుంచి రోగం సంక్రమిస్తుంది.
2. వృశ్చిక రాశిలో సంచారం చేసే సమయంలో శని ఘట సర్ప రూపంలో ఉంటాడు. ఈ సమయంలో కుజుడు యతి రూపంలో తోడు రావడ వల్ల అసహజ మరణాలు, ప్రభుత్వ ఉద్యోగుల మరణం, ఆత్మహత్యలు, హత్యలు, రైతు ఆత్మహత్యలు ఏర్పడతాయి.3. మకర రాశిలో శనికి కుజుడు యతి రూపంలో తోడు అవగానే శని యముడి పాశం లేక సంకెళ్ల రూపంలో ఉంటాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధీనంలోకి ప్రజలు వెళ్లడం, దేశం కర్ఫ్యూలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ సమయంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో వచ్చే జరాన్ని ఆయుర్వేద జ్యోతిష్యంలో కంఠ రోహిణి జ్వరం అంటాం. ఇది అంటు రోగం.
మే 5న కుజ రాశి సంచార మార్పు వల్ల ఈ అంటురోగంలో కొద్దిగా మార్పు వస్తుంది. కానీ శని మారడానికి అనగా నక్షత్ర మార్పునకు జనవరి నుంచి ఫిబ్రవరి 2021 వరకు సమయం పడుతుంది. కాబట్టి అంత వరకు ఈ రోగభయం తప్పదు. ఇంకా శాస్త్రంలో గణిత రూపంలో చెప్పాలంటే.. అసహజ భుజంలో ఏర్పడిన కోణాల్లో ఏర్పడే త్రిభుజిలో మూలలో శని సంచారము వలన ఏర్పడే స్థితి అని చెప్పవచ్చు.
1. దేవతా పరిహారాలు
కరోనా గొంతులో సోకే దగ్గు, జ్వరము కాబట్టి శివుడి మొరపోవడం ఉత్తమం. సాగర మథనంలో శివుడు విషాన్ని తన గొంతులో నింపుకుంటాడు కాబట్టి ఈశ్వరుని పూజిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది.కుజుడికి సుబ్రమణ్య, నరసింహుడు అధిపతి కాబట్టి సుబ్రమణ్య స్వామి, నరసింహ స్వామి పూజలు చేయడం మంచిది. ఇక అంటువ్యాధులు సోకిన సమయంలో గ్రామదేవతలకు ఉల్లిగడ్డలు, మిరియాలు వేసిన పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టడం ముఖ్యమైంది. ప్రతి గ్రామంలో ఇది జరగాలిపూర్వం అమ్మ పోసిన, అంటువ్యాధులు ప్రబలిన సమయంలో గ్రామదేవతలకు నైవేద్యాలు పెట్టే ఆచారం ఉంది. సుంకులమ్మ, సవరమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ ఇలా..ఇక దేవతా పరిహారాలకు తోడుగా ప్రభుత్వ అధికారులు ఇచ్చే సలహాలు పాటించాలి. వైద్యుల సలహాలను స్వీకరించి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి

Related Posts