కరోనా కొత్త లక్షణాలు
న్యూయార్క్, ఏప్రిల్ 28
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మాత్రమే కాదు.. కొత్తగా ఆరు లక్షణాలను సీడీసీ ఈ జాబితాలో చేర్చింది.గ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి కరోనా లక్షణాలనే సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి మరికొన్ని లక్షణాలు వచ్చి చేరాయి. కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోవడం మొదలైన వాటిని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది. అకారణంగా చలి, చలితో వణకడం, గొంతు నొప్పి మొదలైనవి కూడా కరోనా లక్షణాలని సీడీసీ తెలిపింది. SARS-CoV-2 బారిన పడిన 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపింది.ఛాతిలో నొప్పి ఆగకుండా వస్తుండటం లేదా ఛాతిపై ఒత్తిడి ఉండటం అనేవి కూడా కరోనా లక్షణాలు అని తెలిపింది. పెదాలు లేదా ముఖం నీలి రంగులోకి మారడం కూడా కోవిడ్ లక్షణాలని తెలిపింది. వీటన్నింటినీ కరోనా లక్షణాల జాబితాలో చేర్చలేదని యూఎస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది.సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో చలిపెట్టడాన్ని సాధారణ సమస్యగా భావిస్తారు. కానీ ఎలాంటి సమస్య లేకుండా వణికించేలా చలి పెడితే ఇక నుంచి అనుమానించాల్సిందే.