సెట్ లపై కరోనా ఎపెక్ట్
హైద్రాబాద్, ఏప్రిల్ 28
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ ప్రభావం అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై పడింది. ఇప్పటికే ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడగా, అప్లికేషన్లు భారీగా తగ్గాయి. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, పీఈసెట్, లాసెట్తోపాటు మిగిలిన ప్రవేశ పరీక్షలకు గతేడాది కంటే తక్కువ దరఖాస్తులే వచ్చాయి. ఎంసెట్ కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్) గతేడాది 2,17,799 అప్లికేషన్లొస్తే, ఈసారి ఇప్పటి వరకూ 1,90,141 దరఖాస్తులే వచ్చాయి. ఇంజినీరింగ్విభాగంలో గతేడాది 1,42,210 అప్లికేషన్లు రాగా, ఈసారి 1,23,377, అగ్రికల్చర్, ఫార్మసీలో గతేడాది 74,989 దరఖాస్తులు వస్తే, ఈసారి 66,764 వచ్చాయి. ఈసెట్కు లాస్ట్ ఇయర్ 28,241 మంది అప్లై చేయగా, ఈసారి 24,800 మందే దరఖాస్తు చేశారు. పీఈసెట్కు గతేడాది 5,707 అప్లికేషన్లు వస్తే, ఈసారి 3,500 వరకూ వచ్చాయి. ఎడ్సెట్ కు గతేడాది 52,380 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 21,131 మంది అప్లై చేశారు. పీజీఈసెట్ కు కిందటి సంవత్సరం 20,455 దరఖాస్తులు అందగా, ఈసారి ఇప్పటి వరకు5,792 అప్లికేషన్లు అందాయి. లాసెట్కు గతేడాది కంటే 10,914 దరఖాస్తులు తగ్గాయి.పీజీలాసెట్, ఐసెట్ కూడా గతేడాదితో పోలిస్తే అప్లై చేసిన వారి సంఖ్య తగ్గింది. లాక్ డౌన్ వల్ల స్టూడెంట్లు ఇంట్లోంచి బయటకొచ్చే పరిస్థితి లేదని, ఇంటర్నెట్ సెంటర్లన్నీ కూడా మూసే ఉన్నాయని, అందువల్లే దరఖాస్తులు తగ్గినట్టు ఆయా సెట్స్ కన్వీనర్లు చెప్తున్నారు. అన్ని ప్రవేశ పరీక్షలకు మే 5 వరకూ ఎలాంటి ఫైన్లేకుండా అప్లై చేసుకునేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అవకాశమిచ్చింది. మే 7న రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేస్తే , దరఖాస్తుల సంఖ్య కొంత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి కాకపోవడంతో చాలామంది స్టూడెంట్స్ ఇంకా అప్లై చేయకపోవచ్చని భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత అప్లై చేసుకునేందుకు డేట్ను పెంచకపోతే, స్టూడెంట్లు ఫైన్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది