మరో ప్యాకేజీకి కేంద్రం...సిద్ధం
ముంబై, ఏప్రిల్ 28
బడ్జెట్ లోటును పూడ్చడానికి ప్రభుత్వానికి ఆర్థికసాయం చేయాలనే ప్రపోజల్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కరోనాతో వచ్చిన ఇబ్బందుల వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. జీడీపీలో ద్రవ్యలోటును 3.5 శాతానికి పరిమితం చేయాలన్న టార్గెట్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో చేరుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న జనాన్ని, వ్యాపారాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని ప్యాకేజీలను ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఇది వరకే ఈ విషయం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ద్రవ్యలోటుపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని దాస్ వివరించారు. ఖర్చులను తగ్గించడానికి ఇది వరకే ఉద్యోగుల డీఏను ప్రభుత్వం ఆపేసింది. జీతాల్లో కోత పెట్టింది. బలహీనవర్గాల కోసం సహాయక ప్యాకేజీని కూడా ప్రకటించింది. వారికి ఉచితంగా ఆహారం, నగదు ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాల కోసం జీడీపీలో 0.8 శాతం ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందని ఆర్‌బీఐ బాస్ చెప్పారు. కరోనా కారణంగా గత నెల 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తలెత్తిన తరువాత తొలిసారిగా ఓ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గినందున ద్రవ్యలోటు టార్గెట్‌ను ప్రభుత్వం ఇంకా పెంచాలని ఇది వరకే పలువురు ఎకనమిస్టులు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు సూచించారు. జీఎస్టీ ఆదాయం కూడా భారీగా తగ్గుతుంది. డైరెక్ట్ ట్యాక్సుల రాబడీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ రిపోర్టు ప్రకారం ఫిస్కల్ ప్యాకేజీ ఉంటుంది. ద్రవ్యలోటును తగ్గించడానికి అడ్ హాక్ ట్రెజరీ బిల్స్‌ను తొలగించాం. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని తెచ్చాం. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ లోటును పూడ్చడంపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. రాబోయే పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తాం. మా సంస్థ బ్యాలెన్స్‌షీటును మరింత బలోపేతం చేస్తాం. స్థూల ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం.మార్కెట్‌కు మరింత క్యాష్ అందించడానికి ఆర్‌బీఐ మూడు వారాల్లో రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే ఇదే పద్ధతి ఇక నుంచి కూడా ఉంటుందని మార్కెట్లు అనుకోకూడదు. అయితే ఈ రేటు మా ఆర్థిక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌కు ఎక్కువ క్యాష్‌ను పంపించాలి కాబట్టే రెపోరేటును తగ్గిస్తున్నట్టు ఈ నెల 17న ప్రకటించాం. మానిటరీ పాలసీ కమిటీ పర్మిషన్ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు తప్పు. కమిటీ ఒప్పుకున్నాకే రేటును తగ్గించాం. దానికి అన్ని విషయాలనూ వివరించారు